బెడ్ టైం స్టోరీస్ తో ఎంతో మందిని నిద్రపుచ్చుతున్న యాప్..!

-

ఈ రోజుల్లో పడుకోగానే నిద్రపట్టడం లేదు. బెడ్డుమీద అటూ ఇటూ డొల్లిడొల్లి ఎప్పటికో అలా నిద్రలోకి జారుకుంటాం. అసలు పడుకోగానే.. వెంటనే నిద్రలోకి జారుకుంటే.. అంత లక్కీ ఫెలోస్ ఎవరూ ఉండరమే కదా.. ఎన్నో చికాకుల కారణంగా.. నిద్రలేమి సమస్య అందరిని వేధిస్తుంది.
రాజస్థాన్‌కు చెందిన సురభి జైన్‌ ‘నీంద్‌ యాప్‌’. ద్వారా ఆసక్తికరమైన కథలు చెప్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో వినసొంపైన సంగీతంతో మెడిటేట్‌ చేస్తూ.. ఎంతోమందికి సుఖ నిద్ర అనే వరాన్ని ప్రసాదిస్తోంది.. భలే వింతంగా ఉంది కదా..

రాజస్థాన్‌లోని లావా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన సురభిది సంప్రదాయ మార్వాడీ కుటుంబం. సురభి ముందు నుంచీ వ్యాపారమై చేయాలనుకుంది.. కానీ ఎలాంటి బిజినెస్‌ చేయాలన్న దానిపై ఆమెకు స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో కొవిడ్‌ పరిస్థితులే తనకో దారి చూపాయని సురభి అంటోంది. మార్వాడీ కుటుంబం. ఇంట్లో చాలా వరకు వివిధ వ్యాపారాల్లోనే స్థిరపడ్డారు. దాంతో తనకు అదే దిశగా అడుగులు వేయాలనిపించి… ఇలా ఆలోచిస్తోన్న తరుణంలోనే అనుకోకుండా కుటుంబమంతా కొవిడ్‌ బారిన పడింది. ఇది తమ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపిందట..

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. తీరా ఈ మహమ్మారి నుంచి బయటపడినా నిద్ర సమయాల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్నిసార్లైతే ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టేది కాదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకుని.. దీన్ని తన వ్యాపార ఆలోచనతో ఎలా ముడిపెట్టాలన్న విషయంపై ఓ చిన్నపాటి మేధోమథనమే చేసింది.. మరోవైపు నెలల పాటు పరిశోధనలు చేసి.. చివరగా గతేడాది ‘నీంద్‌ యాప్‌’ను ప్రారంభించింది.

సుఖ నిద్రకు ప్రేరేపించే యాప్‌ ఇది. ‘మన జీవనశైలిలో నిద్రకు భంగం కలిగించే అంశాలు బోలెడుంటాయి. మానసిక, శారీరక సమస్యలు కావచ్చు.. చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు.. వ్యక్తిగతంగా ఉన్న అలవాట్లు, జీవన శైలి కావచ్చు.. కారణం ఏదైనా కావొచ్చు.. వీటన్నింటి నుంచి బయటపడి విశ్రాంతి పొందాలంటే బెడ్‌టైమ్‌ స్టోరీస్‌, వినసొంపైన సంగీతం చాలా అవసరం..

ఆసక్తికరమైన లఘు కథలతో పాటు వాటికి బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే మంద్రస్థాయి సంగీతం మనసుకు మెడిటేషన్‌లా పనిచేస్తుంది. ఏకకాలంలో ఈ రెండూ కలగలిపి వినడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే క్రమంలో.. గాఢ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్‌ని రూపొందించడానికి తమ వద్ద నిపుణులతో కూడిన బృందం పనిచేస్తోందని సురభి అంటోంది.

అయితే ఇక్కడ వరకూ బానే ఉంది. మరి మన మాతృభాషలో ఉంటేనే కదా.. మనసుకు త్వరగా అటాచ్ అయ్యేది.. అందుకే ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే అందిస్తోన్న తన సేవల్ని మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోంది సురభి. పైగా ప్రాంతీయ భాషల్లో బెడ్‌టైమ్‌ స్టోరీస్‌ సేవల్ని ఉచితంగా ఆన్‌లైన్‌లో అందిస్తోన్న తొలి భారతీయ యాప్‌ ఇదే.

త్వరలో మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ.. వంటి భాషల్లో ఆసక్తికరమైన కథల్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రి-సీడ్‌ రౌండ్‌లో భాగంగా సుమారు 5 కోట్లకు పైగా పెట్టుబడుల్ని కూడా సేకరించారట. యాప్ సక్ససై.. ప్రాంతీయ భాషల్లోకి వస్తే.. ఎంతమందికి మంచి ఊరట లభిస్తుంది. హాయిగా. ఏదో ఒక స్టోరీ, మ్యూజిక్ వింటూ.. నిద్రపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version