సైబర్‌ క్రైం వల్ల మోసపోయారా..? నేరాన్ని ఇలా ఫిర్యాదు చేయండి..!

-

ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా సైబర్‌ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నా.. మోసగాళ్లు రోజు రోజుకీ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. అయితే ఎవరైనా సరే.. సైబర్‌ మోసానికి గురైతే వారు ఆ నేరం పట్ల సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓ ఆన్‌లైన్‌ సైబర్‌క్రైం కంప్లెయింట్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరి అందులో ఎవరైనా సరే ఎలా ఫిర్యాదు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

This is how you can complaint a cyber crime in online

1. బాధితులు ముందుగా https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో ఉండే ఫైల్‌ ఎ కంప్లెయింట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

2. అనంతరం వచ్చే పేజ్‌లో ఉండే టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను యాక్సెప్ట్‌ చేయాలి.

3. రిపోర్ట్‌ అదర్‌ సైబర్‌ క్రైం బటన్‌ను క్లిక్‌ చేయాలి.

4. సిటిజెన్‌ లాగిన్‌ ఆప్షన్‌ను ఎంచుకుని అందులో రాష్ట్రం, యూజర్‌ నేమ్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి.

5. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని, స్క్రీన్‌లో ఉండే కాప్చాను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

6. అనంతరం వచ్చే స్క్రీన్‌లో ఉండే ఫాంలో వివరాలను నమోదు చేయాలి. అందులో ఇన్సిడెంట్‌ డిటెయిల్స్‌, సస్పెక్ట్‌ డిటెయిల్స్‌, కంప్లెయింట్‌ డిటెయిల్స్‌ అని ఆప్షన్లు ఉంటాయి. వివరాలను ఎంటర్‌ చేసి ప్రివ్యూ అండ్‌ సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

7. ఇన్సిడెంట్‌ డిటెయిల్స్‌ పేజ్‌లో ఫిర్యాదుకు సంబంధించిన కేటగిరి, సబ్‌ కేటగిరిలను ఎంచుకోవాలి. సంఘటన జరిగిన తేదీ, టైం, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఒక వేళ ఫిర్యాదు ఆలస్యంగా చేస్తే ఎందుకు ఆలస్యమైందో చెప్పాలి. అలాగే సంఘటన ఏ ప్రదేశంలో జరిగిందో చెప్పాలి.

8. నేరానికి సంబంధించి బాధితుల వద్ద ఉండే సాక్ష్యాలను సబ్‌మిట్‌ చేయాలి. సోషల్‌ మీడియా అకౌంట్‌ వివరాలు, వెబ్‌సైట్‌, ఈ-మెయిల్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి.

9. సేవ్‌ అండ్‌ నెక్ట్స్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

10. బాధితులకు ఎవరిపై అయినా అనుమానం ఉంటే వారి పేరు, వారి ప్రూఫ్‌లు ఏవైనా ఉంటే సబ్‌మిట్‌ చేయాలి.

11. బాధితులకు చెందిన ఈ-మెయిల్‌ వివరాల, ఫొటో వివరాలను సబ్‌మిట్‌ చేసి నెక్ట్స్‌ స్టెప్‌కు వెళ్లాలి.

12. తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలన్నీ నిజమే అని తెలిపే డిక్లరేషన్‌ ఫాం వస్తుంది. దాన్ని కన్‌ఫాం చేస్తూ సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. దీంతో కంప్లెయింట్‌ రిజిస్టర్‌ అవుతుంది.

13. బాధితుడు తన కంప్లెయింట్‌కు చెందిన డాక్యుమెంట్‌ను పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం అవసరం అనుకుంటే ఆ డాక్యుమెంట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

ఈ విధంగా బాధితులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. వాటికి సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని ఆ వివరాలను బాధితులకు తెలియజేస్తారు..!

Read more RELATED
Recommended to you

Latest news