స్తంభంలా బయటకు వచ్చే టీవీ.. దీని ధరెంతో తెలుసా..?

-

ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. స్మార్ట్ గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ సమాచారాన్ని తెలుసుకోవాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చాలని.. ప్రపంచాన్నే చుట్టేయ్యెచ్చనే భావన అందరిలో ఉంది. ఈ స్మార్ట్ యుగంలో పలు సంస్థలు తమ కొత్త ఆవిష్కరణతో ఎప్పుడు ముందు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు ఇలా పోటాపోటీగా మార్కెట్‌లో తమ ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో ఓ స్మార్ట్ టీవీ విడుదల అయింది.

M-1-TV
M-1-TV

ఇప్పటివరకు చాలా టీవీలు చూశాం. బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి, కలర్ టీవీలు వరకు. ఇప్పుడు స్మార్ట్ టీవీలు, ఫుల్ హెచ్‌డీ క్లారిటీతో, ఆన్‌లైన్‌తో కనెక్ట్ అయ్యే టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు గోడకు మాత్రమే పరిమితమయ్యే టీవీలను చూసి ఉంటాం. కానీ ఈ టీవీ చాలా ప్రత్యేకమైనది. ఒక్క బటన్ నొక్కగానే.. అండర్ గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది బయటికి వచ్చే టీవీ చూశారా. ఈ టీవీ పేరు ఎం1. ఆస్ట్రియాకు చెందిన సీ-సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ దీనిని తయారు చేసింది.

ఈ స్మార్ట్ టీవీ రిమోట్ కంట్రోల్‌ని ప్రెస్ చేసిన తర్వాత.. అండర్‌గ్రౌండ్ నుంచి స్తంభం లాంటిది బయటకు వస్తుంది. ఆ తర్వాత ఐదు 4కే మైక్రో ఎల్ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ ప్రత్యక్షమవుతోంది. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్ టీవీ. ఈ టీవీని చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతారని సీ-సీడ్ కంపెనీ తెలుపుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓఎల్‌ఈడీలతో పోలిస్తే ఈ మైక్రో ఎల్ఈడీల్లో క్లారిటీ అదిరిపోతుందన్నారు. అయితే ఈ ఎం1 టీవీ ధర చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. దీని ధర రూ.2.91 కోట్లు. టీవీ ధర కంటే.. ఈ అండర్‌గ్రౌండ్ సెట్టింగ్‌కు, తదితర ఇన్‌స్టలేషన్ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని.. ఈ ఏడాది చివరిలో ఎం1 టీవీ డెలవరీలు మొదలవుతాయని సీ-సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news