బడ్జెట్ నుంచి మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన వన్ ప్లస్..!!

-

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారి సంస్థ వన్ ప్లస్ మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఈ కంపెనీ విడుదల చేసిన అన్నీ వస్తువుల పై మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.2022 ఏప్రిల్ నెలలో బడ్జెట్ ధరలో Y1S Pro సిరీస్ 4K టీవీ ని తీసుకొచ్చిన వన్ ప్లస్, మరొక పెద్ద టీవీని ఈ బడ్జెట్ సిరీస్ నుండి విడుదల చేయడానికి రెడీ అవుతుంది.

- Advertisement -

 

OnePlus 50 Y1S Pro మరియు ఈ స్మార్ట్ టీవీని అతి త్వరలో లాంచ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని ఇంకా ప్రకటించనప్పటికీ ఈ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం టీజర్ ద్వారా బయటపెట్టింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ని అమెజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది..

టీవీ విషయాన్నికొస్తే..వన్ ప్లస్ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది..వీటితో పాటు మరి కొన్ని ఫీచర్స్ ను కూడా యాడ్ చేసినట్లు తెలుస్తుంది.

టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది..వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది..అంతే కాదు..డోబ్లి ఆడియోను కలిగి ఉంటుంది.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్మార్ట్ టీవీ లకు పోటీ ఇవ్వనుంది.త్వరలోనే టీవీ ధరలు,ఫీచర్స్ ను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...