తుప్పు నాయుడు, పప్పు నాయుడు కుట్రలు పన్నుతున్నారు :కొడాలి నాని

-

మరోసారి టీడీపీ నేతలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాల నాని విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుప్పు నాయుడు, పప్పు నాయుడు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు చేశారు. మద్యంలో విషం ఉందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారని, ల్యాబరేటరీ పని చేసే బాయ్ వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్పాడా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ పైనే ఉంటుందని, దీనికి వీళ్ళు ల్యాబ్ కు వెళ్లి పరీక్షించేది ఏంటి?.. తెలుగు దేశం పార్టీ ఆఫీసుకు వెళ్ళి పరీక్షించారా.. టీడీపీ నాయకులు సగం తాగేసిన బాటిళ్ల నుంచి శాంపిళ్ళు తీసుకుని వెళ్ళారా.. అని ఆయన మండిపడ్డారు.

Do Not Fall Into Chandrababu's Trap, Kodali Nani To Pawan Kalyan

అరవిందో ఫార్మాస్యూటికల్ 1965 లో పెట్టారని, అరవిందో ఫార్మాస్యూటికల్ మందులు ప్రపంచంలో ఎగుమతి కాని దేశం లేదన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఎగుమతి చేస్తున్నారని, అరవిందో ఫార్మాస్యూటికల్ మందుల్లో విషం కల్పితే అరెస్టు చేసి అంతర్జాతీయ కోర్టుల్లో పెడతారని ఆయన వెల్లడించారు. విజయసాయిరెడ్డి వియ్యంకుడని చెప్పి విషం చిమ్ముతున్నారని, రేపు బియ్యంలో విషం అంటారు, ఎల్లుండి మంచి నీళ్ళలో విషం అని ప్రచారం చేస్తారంటూ కొడాలని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news