లాక్‌డౌన్‌.. వాట్సాప్‌, టిక్‌టాక్‌లను వెనక్కి నెట్టిన ‘జూమ్‌’

-

సోషల్‌ మీడియాకు సంబంధించి ఎన్నో కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్న అందులో నిలదొక్కుకుని నిలబడేవి కొన్నే. యూజర్‌ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ, కొత్తదనం, నాణ్యత ఉంటే ఆ యాప్‌ సులవుగా జనాల మధ్యలోకి వెళుతుంది. ఈ కోవలోకి చెందిందే ‘జూమ్‌’ యాప్‌. వీడియో కాన్ఫరెన్సింగ్‌కు సంబంధించిన ఈ యాప్‌ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది వీడియో కాలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సాంకేతికంగా దీనిని క్లౌడ్‌ కాలింగ్‌ అని అంటారు.

ఒకేసారి దాదాపు 50 మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడమే కాకుండా.. ఈ యాప్‌ ద్వారా జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ఆడియో, వీడియో నాణ్యత మెరుగ్గా ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే ఫీచర్స్‌ ఉండటం ఈ యాప్‌పై ఆదరణ పెంచుతోంది. ప్రస్తుతం ఇండియాలో లాక్‌డౌన్‌ కొనసాగుతన్న వేళ ఈ యాప్‌ డౌన్‌లోడ్స్‌ పరంగా నంబర్‌ వన్‌గా నిలిచింది. ప్రముఖ దిగ్గజ యాప్‌లు వాట్సాప్‌, టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు డౌన్‌లోడ్స్‌ పరంగా వెనక్కి నెట్టింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా ఈ యాప్‌ను డౌన్‌లౌడ్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితమైన వేళ స్నేహితులు, బంధువులతో మాట్లాడానికి నెటిజన్లు జూమ్‌ యాప్‌ వైపే మెగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సంస్థ అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news