ప్రేరణ: మీ జీవితంలో ఒక్కసారైనా నిస్వార్థంగా ఉన్నారా? ఒక్కసారి ఈ కథ చదవండి.

ప్రస్తుత ప్రపంచంలో స్వార్థం అనేది విపరీతంగాపెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ తమకోసమే ఆలోచిస్తున్నారు. అవతలి వారి గురించి ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. నిజానికి అలా ఆలోచించే వారిని చేతకాని వారిగా పరిగణిస్తున్నారు. కానీ, జీవితంలో ఒక్కసారైనా నిస్వార్థంగా బ్రతకాలి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు, ఏ విధంగా మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఈ రోజు బాగున్నది రేపటి వరకు నాశనం అయిపోవచ్చు. మీ స్వార్థమే మిమ్మల్ని అనుకోని మలుపులకు తీసుకెళ్ళవచ్చు. ఐతే ప్రస్తుతం నిస్వార్థమైన ప్రేమ గురించి ఒక కథ తెలుసుకుందాం.

little boy-holding-girl

ఒక కుటుంబంలో ఆరేళ్ళ చిన్న పాపకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. రక్తానికి సంబంధించిన వ్యాధి కారణంగా ఆమెకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఐతే ఆమె బ్లడ్ గ్రూప్ ఎక్కువ మందికి ఉండదు. అందువల్ల రక్తం దొరకడం కష్టమైపోయింది. చివరికి ఆ పాప అన్నయ్య బ్లడ్ గ్రూప్, ఆ పాప గ్రూప్ తో మ్యాచ్ అయ్యింది. దాంతో డాక్టర్లు, ఇతర కుటుంబ సభ్యులందరూ, ఆ పాప కండీషన్ ఎలాంటిదో, ఆమెకు రక్తం ఎందుకు అవసరమో ఆ అన్నయ్యకి క్లియర్ గా చెప్పారు. అంతా విన్న ఆ అబ్బాయి, ఒకరోజు టైమ్ తీసుకుని బాగా ఆలోచించి, సరే అని ఒప్పుకున్నాడు.

తెల్లారి ఆ పాప బెడ్ పక్కనే మరో బెడ్ వేసి ఆ అబ్బాయి రక్తాన్ని పాపకు ఎక్కించారు. సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. డాక్టర్లు చాలా సంతోషించారు. కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారు. కానీ ఆ పిల్లాడు మాత్రం డాక్టర్ వైపు తిరిగి, డాక్టర్.. నేనింకా ఎంత సేపట్లో చచ్చిపోతాను. అని అడుగుతాడు. అది విని డాక్టర్ షాక్ అవుతాడు. రక్తం ఇస్తే చనిపోతాడని ఆ అబ్బాయి అనుకున్నాడు. అయినా కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నిస్వార్థమైన ప్రేమకి నిదర్శనం ఇంతకన్నా మరేదీ ఉండదేమో!