కార్తీకదీపం ఎపిసోడ్ 1203: మోనిత ఇంట్లో బారసాలకు వంటలు చేస్తున్న దీప..చూసి షాకైన కార్తీక్ కుటుంబం

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంట్లో ఉన్న మోనిత బారసాలకు అందరిని పిలుస్తుంది. నేను తీసుకువస్తాను అంటున్నాను కదా నువ్వు హ్యాపీగా వెళ్లు అని దీప అంటుంది. మోనితకు టెన్షన్ మొదలవుతుంది. వెళ్లిపోతుంది. దీప కూడా పిల్లలతో కలిసి గుడికి వెళ్తుంది. కారులో వెళ్తున్న మోనిత దీపక్క ఏంటి నన్ను కన్ఫూస్ చేస్తుంది, ఆ సిచ్చూవేషన్ లో ఎవరు ఉన్నా.లబోదిబోమని ఏడ్వాలి కానీ ఏంటి అలా ఉంది. దీప ప్లాన్ ఏంటి, ఎటునుంచి నరుక్కొస్తుంది. ఏం చేయబోతుంది అనుకుని మళ్లీ..ఆనంద్ రావు గారు ఉండగా నాకేంటి భయం, ఆనంద్ రావుగారిని అడ్డంపెట్టుకుని ఆ ఇంటి కోడలుగి అడుగుపెట్టొచ్చు అనుకుంటే..ఈ దీప ఏంటి ఇలా చేస్తుంది అనుకుని..కారు ఆపి..అసలు ఇలాంటి సీన్ లో ఎవరైనా పిల్లలకు జాగ్రత్తలు చెప్పి మొగుడికాళ్లకు దన్నంపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోవాలి కదా..ఏ సినిమాలో అయినా ఇదే కదా జరిగేది మరి ఈ దీప ఏంటి ఇలా చేస్తుంది..అయినా ఎన్నో చూశాను, నేనేంటి దీపకు భయపడటం అనుకని మేకపోతు గాంభీర్యం తెచ్చుకుని ఏదేదో షిట్ అంతా మాట్లాడుకుంటుంది.

ఇంకోపక్క కార్తీక్ అండ్ ఫ్యామిలి దీప మాటలకు భయపడి..ఏంటి మమ్మీ దీప ఏం చేస్తుందో అర్థమవుతుందా. బారసాలకు మనల్ని తీసుకెళ్తా అనటమేంటి. దీపకు ఏమైంది అని కార్తీక్ అంటాడు. సౌందర్య దీప మనసులో ఏం ఉందో అస్సలు అర్థంకావటం లేదు. నిజం తెలిశాక..నన్ను నిలదిస్తే బాగుండేది..మనసు తేలికపడేది, కానీ ఏం మాట్లడలేదు అని దీప ప్రవర్తన గురించి చెప్తూ బాధపడుతుంది. మీరేం మాట్లాడరేంటండి అని ఆనంద్ రావుని అడిగితే..దీప మౌనంగా ఉందని మీరు భయపడుతున్నారు..కానీ దీప ఎంత గొప్పది కాకకపోతే..పూజ దగ్గరకు వచ్చి అన్నీ చూసినా కానీ. బాధను దిగమింగి బయటకు చిరునవ్వుతో ఉంటుంది చూడు అది దీప వ్యక్తిత్వం. మీరంతా కలిసి దీప కళ్లకు గంతలు కట్టారు..కానీ ఆ కళ్లగంతలోంచి అన్నీ చూస్తుంది..అది దీప అమాయకత్వం కాదు..గొప్ప మనసు ఉండాలి అలా చేయాలంటే అంటాడు. కార్తీక్ పరిస్థితి మన చేయి దాటిపోయింది, ఏదో ఒకటి చేయి మమ్మీ, దీప ఏం చేస్తుందో. ఏం చేయబోతుందో ఊహకే అందకుండా ఉంది..నాకు టెన్షన్ గా ఉంది., దీప రాగానే కాళ్లమీదపడి క్షమించమని అడుగుతాను, దీపకు చెప్పేస్తేనే గుండెల్లో ఇంత భారం ఉండేది కాదేమో అని కార్తీక్ అంటాడు.

మరోపక్క దీప పిల్లలతో షాపింగ్ పూర్తిచేసుకుని కారులో వస్తారు. శౌర్య మన ముగ్గురమే ఇలా బయటకు వచ్చి చాలారోజులైంది కదా అంటే..షాపింగ్ కు నాన్నను తీసుకుని వస్తే బాగుండేది అని హిమ అంటే..మీ నాన్నకు చాలా పనులుంటాయి కదమ్మా అని దీప అంటుంది. నాన్నకు ఏం పనులేవు, ఇంట్లోనే ఉంటున్నారు అని హిమ అంటుంది. వీళ్లు ఇలా కాసేపు మాట్లాడుకుని..రెస్టారెంట్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. పిల్లలు సంతోషంగా మాట్లాడుతుంటే..దీప మాత్రం వైరాగ్యం వచ్చినట్లు మాట్లాడుతుంది

ఇంట్లో కార్తీక్ టెన్షన్ తో అటూఇటూ తిరుగుతూ ఉంటాడు. ఫోన్ చేశారు కదా, రెస్టారెంట్ లో భోజనం చేసి వస్తారు అన్నారు కదా ఇంకెందుకు టెన్షన్..కార్తీక్ మీకు అర్థంకావటం లేదు మమ్మీ, దీప ఏదో పెద్ద షాక్ ఇవ్వబోతుంది, ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది, ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది ఏం చేద్దాం మమ్మీ అంటాడు. మధ్యలో ఆనంద్ రావు ఇంత జరిగాక ఏ భార్య అయినా ఎందుకు ఉంటుంది అంటాడు. అసలే టెన్షతో చచ్చిపోతున్న కార్తీక్..డాడీ ప్లీజ్ మీరు అలా అనకండి, ఏదైనా సలహా ఇవ్వండి అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే..కారు సౌండ్ వస్తుంది.. అదిగో కారు వచ్చింది దీప వచ్చినట్లు ఉంది అనుకుంటారు. పిల్లలు మాత్రమే వస్తారు. మీ అమ్మ ఏదే అని అని సౌందర్య అడిగితే..అమ్మరాలేదు, వెళ్లిపోయింది నాన్నమ్మ అని శౌర్య అంటుంది. ఎక్కడికి వెళ్లింది అంటే..అమ్మ అమ్మమ్మ తాతత్య వాళ్ల దగ్గరకు వెళ్తాను అనింది అని శౌర్య చెప్తుంది. ఎప్పుడు వస్తాను అని ఏమైనా చెప్పిందా అని సౌందర్య అంటే..ఏమో మాకు ఏం చెప్పలేదు నాన్నమ్మ..తను అమ్మమ్మ తాతయ్య వాళ్ల దగ్గరు వెళ్తా అనింది. తను మిమ్మల్ని రేపు ఎక్కడికో రమ్మందికదా..అక్కడ కలుస్తా అనింది చెప్తారు.

ఇంటికి రాకుండా అక్కడికి వెళ్టమేంటి అనుకని కార్తీక్ దీపకు ఒకసారి కాల్ చేయమంటుంది సౌందర్య. దీప ఫోను స్వీచ్ఛ్ ఆఫ్. దీప తన పుట్టింటికి వెళ్తే ఫోను స్విచ్ఛ్ ఆఫ్ ఎందుకు పెడుతుంది. అంటే దీప అక్కడికి వెళ్లలేదా అంటాడు ఆనంద్ రావు..అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో కార్తీక్, ఆనంద్ రావు, సౌందర్య మోనిత ఇంటికి బారసాలకు వెళ్తారు. మోనిత ఇంట్లో దీప వంటలు చేస్తుంది. మోనిత కార్తీక్ వాళ్లను చూసే..దీపను పిలిచి వంటలు ఎక్కడివరకూ వచ్చాయ్ అని అడుగుతుంది. అన్నీ అవుతున్నాయ్ మోనిత నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా అంటుంది దీప. ఇదంతా చూస్తున్న కార్తీక్..దీప నీకు ఇక్కడేం పని అని చేతిలో ఉన్న గరెట కిందపడేస్తాడు. దీప ఈ బారసాల కానివ్వు అంటుంది. మోనిత మనసులో దీపక్క ఈ కథకు ఏదో క్లైమాక్స్ ఇవ్వబోతుంది అనుకుంటుంది. రేపు ఈ దీప ఏం చేస్తుందో చూడాలి. ఎప్పటిలాగే..హైప్ ఇచ్చి తుస్ మనిపించే ఏదో చెత్తప్లాన్ హే వేసినట్లు ఉంది వంటలక్క.