గుప్పెడంతమనసు 308 ఎపిసోడ్ : ఏటూ చూసిన వసు జ్ఞాపకాలే..ఆఖరికి సెక్యురిటీని కూడా వసూనే అనుకున్న రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కాలేజ్ కి వస్తాడు. కాలేజ్ లో వసూ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. వసూ క్లాస్ రూం చూస్తడు. అక్కడ ఎవరూ లేకున్నా మనోడికి క్లాస్ అంతా స్టూడెంట్స్ ఉన్నట్లు..వసూ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. వసూ ప్లేస్ లో కుర్చుంటాడు. వసూ కాలేజ్ కి వస్తుంది. క్లాస్ రూంలో ఉన్న రిషీకి సెక్యురిటీ కాపీ తెమ్మంటారా అని అడిగితే అది రిషీకి వసూ అడిగినట్లు అనిపిస్తుంది. వాట్ నువ్వు కాఫీ తేవడమేంటి అంటాడు. సార్ నేనే కదా తెచ్చేది అంటాడు సెక్యురిటీ. రిషీ ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, వసుధార నాకు ఎందుకు ఇలా గుర్తుకువస్తుంది అనుకుంటాడు. ఇంతలో వసుధార కాలిపట్టీల గల్ గల్ శబ్దాలు వినబడతాయి. వసూ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే..రిషీ మళ్లీ ఊహన అనుకుని..నిన్ను కాఫీ తెమ్మన్నానుకదా అంటాడు. కాఫీ ఏంటి సార్ అంటుంది వసూ. నువ్వు నిజంగానే వచ్చావా అంటాడు. నిజంగా రావడం ఏంటి సార్ అంటుంది వసూ. రిషీ వసూ పట్టీల వైపు చూస్తాడు. వసూ ఇంటికి వచ్చారంట అంటే..ఏ రావద్దా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అంటాడు. అంటే నేను ఖాళీగా ఉన్నానని, మీరు కాలేజ్ లో ఉన్నారని వచ్చాను అంటుంది వసూ. నేను చెప్పానా ఇక్కడ ఉంటానని అంటాడు రిషీ. వసూ రాత్రి రిషీ యే చెప్పింది గుర్తుచేసుకుని..మీరే కదా చెప్పారు, మళ్లీ పొద్దున్నే ఎందుకులే గొడవ అనుకుని ఎందుకు ఉన్నట్లు అంటుంది. వర్క్ ఉంది అని రిషీ అంటే..నేను చేస్తాను ఆ వర్కేంటో చెప్పండి అంటుంది.

ఇంతలో కాఫీ తెస్తాడు సెక్యురిటీ. ఒకటే కప్ ఉండటంతో..రిషీ కప్ వసూకి ఇచ్చి తను సాసర్ లో తాగుతాడు. క్లాస్ రూంలో కాఫీ తాగటం బాగుంది అనుకుంటాడు. అదే మాట వసూ చేప్తే..ఏం బాగుంది, కాఫీ ఎక్కడ తాగినా కాఫీయో కదా అంటాడు. వసూ కాలిపట్టి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటుంది. ఇంకా చెప్పలేదేదేంటా అనుకున్నాను అంటాడు రిషీ. ఈ పట్టీలు మా అమ్మనాకు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్తుంది వసూ. అసలు కాలేజ్ కి ఎందుకు అంత రాత్రి టైంలో వచ్చావ్ అంటే.వసూ జరిగింది చెప్తుంది.

ఈ హాలీడేస్ ని వృథా చేయొద్దుసార్..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు పనులన్నీ చేద్దాం అంటూ లొడలొడా మాట్లాడుతుంది. రిషీ ఏం మాట్లాడడు. వసూ మీరేం మాట్లాడటం లేదు అంటే..పర్లేదు చెప్పు వింటున్నాను కదా అంటాడు. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా, బోర్ కొట్టిస్తున్నానా అంటుంది. అసలు నువ్వు చాలా ఆసక్తికరంగా మాట్లడతావు, అసలు బోర్ కొట్టదు అంటాడు రిషీ. ఇంతలో రిషీకి దేవయాని ఫోన్ చేస్తుంది. కట్ చేస్తాడు. దేవయాని సెక్యురిటీకి ఫోన్ చేస్తుంది. రిషీ కాలేజ్ లో ఉన్నాడని, వసుధార కూడా పక్కనే ఉందని సెక్యురిటీ మాటలను బట్టీ దేవయానికి అర్థమవుతుంది.

కారులో రిషీ, వసూ వస్తుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. కారు టైర్ పంచర్ అ‌వడంతో వసూ సార్ సార్ అంటూ టెన్షన్ పడుతుంది. ఎందుకు అలా అరుస్తున్నావ్..టైర్ పంచరైనట్లు ఉంది అంతేకదా అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే..నేను ముందు కుర్చుంటాను, నువ్వు తొయ్యి..రిపేరింగ్ షాప్ దగ్గర ఆపుతాను అంటాడు. వసూ విజువల్ ఇమాజిన్ చేసుకుని..వామ్మో నావల్ల కాదు అంటుంది. నువ్వు హెల్ప్ చేస్తా నంటే..నేను టైర్ మారుస్తాను అంటాడు రిషీ.

ఇంట్లో మహేంద్ర కాపీ తాగుతుంటే..దేవయాని వచ్చి ఏంటి విశేషాలు అంటుంది. ఏముంటాయ్ వదినా ఏమిలేవు అంటాడు. దేవయాని చురకలు అంటించి..మెయిన్ మ్యాటర్ కు వస్తుంది. సెలవురోజు నువ్వు ఇంట్లో ఉంటే..రిషీ కాలేజ్ లో ఎందుకు ఉన్నాడు., వసుధార ఎందుకు వచ్చింది అంటుంది. ఓహో వసుధార వెళ్లిందా నాకు తెలియదు అంటాడు మహేంద్ర. వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుుతంది, నువ్వు చూస్తున్నావా, చూసినా చూసిచూడనట్లు ఉంటున్నావా అంటే..మహేంద్ర వాస్తవం చెప్తాడు..వాళ్లిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అలా జరుగుతుంది అంటాడు. దేవయాని రిషీ మన చేయిదాటిపోతున్నాడు నువ్వు జాగ్రత్తలు చెప్పు అంటే..అదే మాట మీరే చెప్పొచ్చుగా అంటాడు మహేంద్ర. నేను చెప్పే రీతిలో చెప్తాను, ముందు నీకు చెప్తున్నాను అంతే అని దేవయాని వెళ్లిపోతుంది. ధరణి వచ్చి ఏంటి మావయ్యగారు అత్తయ్య కోపంగా వెళ్తున్నారు అంటే..రిషీకి వార్నింగ్ ఇవ్వమని..నాకు వార్నింగ్ ఇస్తుందమ్మా అంటాడు మహేంద్ర. మనం చెప్తే వింటాడా ఏంటి రిషీ అని ధరణి అనటంతో మహేంద్ర అంతేకదాఅని నవ్వుతాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news