క్షమాపణ కోరితే సస్పెన్షన్ ఎత్తివేస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

-

రాజ్యసభ ఎంపీలు 12 మందిని తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, వారు సభకు, చైర్మన్‌కు క్షమాపణ చెబితే వారిని సస్పెన్షన్ వెనక్కి తీసుకునేందుకు పరిశీలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు. గత ఆగస్టులో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది ఎంపీలను సోమవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, శివసేన నుంచి 2, తృణమూల్ కాంగ్రెస్‌ నుంచి 2, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులను శీతాకాల సమావేశాల మొత్తానికి సభ నుంచి సస్పెండ్ చేశారు.

సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉన్నది. ఇందుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కానీ, తమ అనుచిత ప్రవర్తనకు చింతిస్తూ స్పీకర్, సభను 12 మంది ఎంపీలు క్షమాపణ కోరితే, సహృదయంతో వారిని సస్పెన్షన్ వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని ప్రహ్లాద్ జోషి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news