గుప్పెడంతమనసు ఎపిసోడ్ 304: మిర్చీబజ్జీలతో అందరినోరూరించేలా చేసిన వసుధార..ఇగోమాష్టర్ కు చెమటలే..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కారులో వెళ్తున్న రిషీ, వసూ..రెస్టారెంట్ కి వెళ్లటం లేదా అంటే.. ఎగ్జామ్స్ అయ్యే వరకూ డ్యూటీకి రాను అని చెప్పాను అంటుంది. ఎగ్జామ్స్ అయ్యాక..హ్యాపీగా సెలవులు గడిపేద్దాం అనుకోకు..మనకు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ వుంది అంటే..అవును సార్, జగతి మేడమ్ కూడా అదే చెప్పారు అంటుంది వసూ. రిషీ మనసులో నేను చెప్తున్నాను కదా, మధ్యలో ఆవిడ టాపిక్ తీయటం ఎందుకో అనుకుంటాడు. ఇంతలో రోడ్డుపక్కన మిర్చీబజ్జీల స్మెల్ వస్తుందని..సార్ సార్ కారు ఆపండి అని ఓ పిలస్తుంది. రిషీకి ఏం వాసన రాదు. వసూ మిర్చీబజ్జీ గురించి చెప్తూ..కారు వెనక్కు తీసుకెళ్లరా తిందాం అంటుంది. రిషీ మొదట ఒప్పుకోడు..వసూ ఎలాగోలా ఒప్పిస్తుంది. బండిదగ్గరకు వెళ్తారు. రిషీ ఆగు ఆగు అంటున్నా..వసూ కారు దిగుతుంది. ఏంటి సార్ మీరు..మిర్చీ తినటానికి కూడా బతిమిలాడించుకుంటారు, కావాలంటే డబ్బులు నేను ఇస్తాను అంటుంది వసూ. ఇప్పుడు డబ్బులు గురించి ఎవరు తీశారు..వస్తాను కానీ ఒక కండీషన్ అని..నువ్వు గతంలో ఆ మొక్కజొన్న కంకులు కాల్చినట్లు చేయకుండా ఉంటానంటే వస్తాను అంటాడు. మొత్తానికి రిషీని ఒప్పించి మిర్చీబండి దగ్గరకు తీసుకెళ్తుంది. కామెడీ ఏంటంటే..వసూ కారులోంచి ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా..ఆ బ్యాగ్ వదలదు. కారులో వేసి రావొచ్చుగా. రెండు ప్లేట్స్ మిర్చీ చెప్తుంది. రిషీకి సిగ్గేస్తుంది. కారులో కుర్చోని తిందాం అంటే..వసూ ఇక్కడ తింటేనే న్యాచురల్ గా ఉంటుంది అని మిర్చీలో ముందు ఈ కొస కొరకాలి అని తిని చూపిస్తుంది. రిషీని తినండి తినండి అంటుంది. రిషీ మిరపకాయను వదిలేసి తినబోతాడు. వసూ ఊరుకోదుగా..అలా తినకోడదు అని పెద్ద స్టోరి చెప్పబోతుంది. అలా మిర్చీబజ్జీల గురించి వసూ చెప్తుంటే..ప్రేక్షకులకు కూడా తినాలనిపిస్తుంది. వసుధార నీకు ముందే చెప్పాను..ఇదంతా చెప్పొద్దని ఎలాఅయితే తింటాడు. తిని హ్యాండ్ వాష్ చేసుకుని టిష్యూపేపర్స్ అడుగుతాడు. వసూ సార్ ఇక్కడ అవన్నీ ఉండవు అని చున్నీ ఇస్తుంది.

మిర్చీబజ్జీల టాపిక్ ఇక్కడితో వదిలేయాలి అని రిషీ అంటాడు. సరే సార్ అంటుంది వసూ. రిషీ రేపటి ఎగ్జామ్ చదువుకోవాలి ఇలా టైం వేస్ట్ చేస్తే ఎలా అంటాడు . రేపటి సబ్జెట్ మా ఏండీగారిది..ఇలా చెప్తే అలా బుర్రలోకి వెళ్తుంది అంటుంది వసూ. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు వసుధార అంటే..దానికి కూడా వసూ ఓ మంచి కొటేషన్ ఇస్తుంది. కారులో ఇంటి దగ్గర దింపుతాడు. వసూ లోపలికి రావొచ్చుగా అంటే..రిషీ నువ్వు పిలిచినా నేను రానని తెలుసు, అయినా ఎందుకు పిలుస్తావ్ అని..ఏంటి ఆలోచిస్తున్నావు, ఇప్పటిదాక బానే ఉన్నావు, అప్పుడే మూడ్ మారిపోయింది అనుకుంటున్నావా..అలా ఏం ఉండదు, నేను కొన్ని నమ్ముతాను, ‌వాటినే పాటిస్తాను అంటాడు. శిరీష్ విషయంలో తప్పుగా ఆలోచించినందుకు మనసులో బాధపడి..గుడ్ నైట్ చెప్పి వెళ్తాడు.

వసూ ఇంట్లోకి వస్తుంది. జగతి చూస్తుంది. రిషీ సార్ డ్రాప్ చేశారు మేడమ్ అంటుంది వసూ. లోపలికి పిలవలేదా అంటే..ఆయనకు రావాలనిపిస్తే వస్తారుకానీ, మనం పిలిస్తే వస్తారా మేడమ్..అంటుంది వసూ. రిషీని బాగానే అర్థంచేసుకున్నావ్ అంటుంది జగతి. రిషీ సార్ మన అంచనాలకు ఎప్పుడూ అందరూ మేడమ్ అంటుంది వసూ.జగతి కూడా నిజమే..రిషీని అంచనా వేయటం చాలా కష్టం అనుకుంటుంది.

తెల్లారి మార్నింగ్..ఫణీంద్ర, మహేంద్ర మాట్లాడుకుంటారు. రిషీ లేచాడా అని ఫణీంద్ర ధరణీ అడిగితే..లేదు మావయ్యా, రాత్రి లేటుగా వచ్చాడు, అందుకే కాఫీ కూడా ఇవ్వలేదు అంటుంది ధరణి. ఆ విషయానికి ఫణీంద్ర మంచి పనిచేశావ్ అమ్మా, నువ్వు మీ అత్తయ్యలాగా ఆలోచించకు అమ్మా అంటూ ధరణీకి హితబోద చేస్తాడు. మహేంద్ర బాగా చెప్పారు అన్నయ్య అంటాడు. ఇలా మాట్లాడుతుండగానే., రిషీ వస్తాడు. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో..రిషీ కారు ఫణీంద్రకు ఇ‌వ్వడంతో..అనుకోని పరిస్థితుల్లో జగతి, రిషీ ఒకే కారులో వస్తారు. అది చూసిన వసూ, మహేంద్ర చూసి నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటారు. అదే సార్ నాకు అర్థంకావటం లేదు అనుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news