ఇలాంటి భర్త, కొడుకు దొరకడం నారా భువనేశ్వరి దురదృష్టం : కొడాలి నాని

చంద్రబాబు నాయుడుపై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు వైసీపీ ఎదో అన్నారని కుంటి సాకులు చెప్పి అక్కడికి వెళ్ళాడని…  ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర అని నిప్పులు చెరిగారు. ఆయన, ఎల్లో మీడియా ఆమెను అల్లరి అల్లరి చేస్తున్నారని… ఎక్కడ కూడా ఆమెను అసెంబ్లీలో కానీ, బయట కానీ మేము చెప్పలేదన్నారు. ఇలాంటి భర్త, కొడుకు దొరకడం నారా భువనేశ్వరి దురదృష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏడుపు ముఖం పెడతాడని… అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు అంటూ చురకలు అంటించారు. అక్కడ పరిష్కారం కానివి ఎమున్నాయో మాకు చెప్పాలని… వాటన్నిటినీ వదిలేసి నా భార్యను అవమానించారు అని చెప్తాడని నిప్పులు చెరిగారు. జగన్ ను ఇబ్బంది పెట్టి సోనియా నుంచి నీ కొడుకు వరకు సర్వ నాశనం అయ్యారని… జగన్ పై కేసులు వేసిన వారు ఏమయ్యారో మనం చూశామని తెలిపారు. జగన్ ను వేధించిన వాళ్ళకి చంద్రబాబు లాంటి నీచమైన గతి పడుతుందని… వైఎస్సార్ మరణం చాలా గొప్ప మరణం…నీది నీ కొడుకుది కుక్క బతుకు అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. ఈ రోజుకీ వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారని… నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుతున్నాడని మండిపడ్డారు.