గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ రోమియో జూలియట్ బుక్ చదవలేదు అనేసరికి గౌతమ్ ఇక చెప్పటం మొదలుపెడతాడు.ఇంతలో రిషీ నోర్మూస్తావా అంటే.. గౌతమ్ టైం వేస్ట్ కాకుండా..వసుధారకు నేను చెప్తున్నానురా అంటాడు. రిషీ వసుధార నువ్వెళ్లు అని పంపించేస్తాడు. అంతే గౌతమ్ పిలుస్తాన్నా వసూ వినకుండా వెళ్లిపోతుంది. ఇది కరెక్ట్ కాదు రిషిని అంటాడు.. నువ్వు చేసేది కరెక్ట్ కాదని నేను అంటున్నా అని రిప్లై ఇస్తాడు రిషి. అసలు నువ్వు నాకెందుకు అడ్డుపడుతున్నావని అడుగుతాడు గౌతమ్. నువ్వు వెళ్లేదారి కరెక్ట్ కాదని రిషి అంటే..నువ్వు నా పాలిట విలన్ లా తయారవుతున్నావ్ అంటాడు గౌతమ్.వసూ బ్రిలియంట్ స్టూడెంట్..నేను ఒక లెక్చరర్ గా..తన గురించి ఆలోచించాలి..నీ ఫ్రెండ్ గా నీ గురించి ఆలోచించాలి అంటాడు రిషీ. వసు గురించి నా గురించి ఆలోచించు అడ్డుపడకు అని గౌతమ్ అంటాడు. నువ్వు చేసే ప్రయత్నాలు తప్పు , నీ దారి తప్పు అని రిషి అనగానే.. నువ్వేమైనా అని డౌట్ గా అడుగుతాడు గౌతమ్..రిషీ ఛ ఛా అలాంటిదేం లేదు అంటాడు రిషీ. నువ్వు నీ లిమిట్స్ క్రాస్ అయితే నేను కూడా నా లిమిట్స్ క్రాస్ అవుతా చూసుకో అంటాడు. గౌతమ్ తు కోపం వస్తుంది. రిషీ కాఫీకి తీసుకెళ్తాడు.
ఇంట్లో కూర్చుని రిషీ ప్రేమ అంటే ఏంటో అర్థమైందా అన్న మాటలను తలుచుకుని.. ప్రేమ గురించి ఆలోచనలో పడుతుంది. జగతి వచ్చి మాట్లాడుతుంది. నీకు సెలవు దొరికిన రోజు కూడా చదవాలా..ఎక్కడికైనా బయటకు వెళదామా అంటే ఎందుకు లెండి అంటుంది వసు. సరేలే అని జగతి వెళ్లిపోతుంటే.. మహేంద్ర సర్ ని రమ్మనండి కబుర్లు చెబుతారు అంటుంది వసు. మహేంద్రని రమ్మని చెప్పడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అని జగతి వెళ్లిపోతుంది. మీరు వద్దంటే నేను మానేస్తానా అంటూ కాల్ చేస్తుంది వసు… మహేదంర్ ఆ ఫోన్ ఉత్సాహంగా మాట్లాడుతూ..నువ్ువ ఇంతలా చెప్పాలా..నేను వచ్చేస్తున్నా అంటూ తెగ సంబరపడతూ మాట్లాడతాడు..ఎదురుగా రిషి వస్తాడు. ఫేస్ లో హుషారు, ఆనందం..ఎక్కడికో బయలుదేరినట్లు ఉన్నారు అంటే.. మహేంద్ర యాక్చువల్లీ అంటూ సాగదీస్తాడు..ఎక్కడికి అని అడగను డాడ్.. ఆనందంలో కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరిచిపోవద్దని చెబుతాడు. ఈ సాన్ భలే ఫన్నీగా ఉంటుంది. మరోవైపు గౌతమ్.. ధరణి దగ్గరకు వెళ్లి నేను వసుధార దగ్గరకు వెళుతున్నా అంటాడు. మీరే షాక్ అవుతున్నారు..రిషికి తెలిస్తే ఇంకా షాక్ అవుతాడు ఈ విషయం వాడికి చెప్పొద్దనేసి వెళ్లిపోతాడు. గౌతమ్..వసు దగ్గరకు వెళతా అంటున్నాడేంటి అసలు ఏం జరగబోతోందో అనుకుంటుంది ధరణి.
అంకుల్ బయటకు వెళుతున్నారా అంటూ మహేంద్రని అడిగిన గౌతమ్..లిఫ్ట్ కావాలంటాడు. ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే ఓ ఇంపార్టెంట్ ప్లేస్ కి అని చెబుతాడు గౌతమ్. మహేంద్ర దానికొకపేరు..స్ట్రీట్ నెంబర్ అలాఏవో ఉంటాయి కదా అని మహేంద్ర అంటే.. కొన్ని పనులు చెబితే అవవు అంటారు కదా అందుకే ఇప్పుడు చెప్పలేనని అంటాడు గౌతమ్.. సరే అంటాడు మహేంద్ర..మరి నన్ను దీవించారా అని గౌతమ్ అంటే.. నీ కోరికలో న్యాయం ఉంటే..విజయం నీదే అవుతుంది అంటాడు మహేంద్ర. ఇద్దరూ కలసి కార్లో వెళతారు. గౌతమ్.. తండ్రి-కొడుక్కి అభిప్రాయబేధాలు వస్తుంటాయి.., నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి అని ఫోర్స్ చేస్తుంటారు.. మీరిద్దరికీ ఎలా కుదిరింది అని అడుగుతాడు గౌతమ్. రిషి పై మీకెప్పుడూ కోపం రాలేదా అంటే..నాపై నాకు కోపం వస్తుంది కానీ రిషిపై కోపం రాదంటాడు. మీరు జోవియల్ -రిషి సీరియస్..మీరు అందరితో కలసిపోతారు-రిషి వాడి సొమ్మేదో తిన్నట్టు సీరియస్ గా మొఖం పెడతాడు. వాడు జోక్ వేయడు-మనం జోక్ వేసినా నవ్వడు…రిషి అలా ఉంటే ఎలా నచ్చుతుంది అని అడుగుతాడు గౌతమ్. మహేంద్ర ఒక ఉదాహరణ చెప్పి.. తను తనలా ఉంటేనే బావుంటుంది.. రిషి నాకు కొడుకు మాత్రమే కాదు నా హీరో ..నువ్వు చెప్పినవన్నీ చిన్న చిన్న కారణాలు.. కానీ లక్షల మందిలో లేని క్వాలిటీస్ వాడిలో ఉన్నాయి…రిషి విషయంలో నేను గర్వంగా ఫీలవుతా, ఒక తండ్రి ప్రేమ తెలుసుకోవాలి అంటే..ఆ మనిషి తండ్రి అయినప్పుడై తెలుస్తుంది..నువ్వు ఎక్కడ దిగాలో చెప్తే కారు ఆపుతాను అంటాడు మహేంద్ర. గౌతమ్ వసుధార ఇంటి దగ్గర దింపమని అడగలేను అనుకుని..ఇక్కడే పక్కన ఆపండి అంటాడు.
ఎక్కడున్నావ్ అని వసుధారకి కాల్ చేసిన రిషి.. స్పీడ్ స్పీడ్ గా..ఎక్కడున్నావ్, ఏం చేస్తున్నవ్, ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. వసూ మొక్కలకు నీళ్లు పడుతూ..చదువుకుంటున్నా అని చెప్తుంది. రిషీ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషిని చూసి షాక్ అవుతుంది వసూ. ఎందుకు వచ్చారు అని అడిగితే ఏం రాకూడదా అని సమాధానం ఇస్తాడు రిషీ.. వాటర్ కావాలి అని అడగడంతో లోపలకు వెళ్లిన వసుకి..వాటర్ బాటిల్ తో రెడీగా ఉంటుంది జగతి..రిషి టెన్షన్ గా కనిపిస్తున్నాడు ఎక్కువ ప్రశ్నలు వేయకుండా చెప్పింది విను వసుధార అంటుంది జగతి. వసూ వాటర్ ఇస్తుంది. రిషీ కంగారుగా చూస్తాడు. ఏదైనా ప్రాబ్లెమా అని వసు అడిగిన ప్రశ్నకు కొందరు మనుషుల వల్ల ప్రాబ్లెమ్ అని రిప్లై ఇస్తాడు. పద వెళదాం అంటూ తూలిపడబోతుంటే వసు పట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ లో సాంగ్..వీళ్ల పని బాగంది. ఇంతలో అక్కడకు ఫుల్ జోష్ లో వచ్చిన మహేంద్ర రిషిని చూసి షాక్ అవుతాడు. రిషి నువ్వేంటి ఇక్కడ అంటే పనుండి వచ్చా అని చెబుతాడు రిషి. వాటర్ కావాలని మహేంద్ర అడుగుతాడు.. జగతి ఏంటి తండ్రికొడుకు వచ్చిరాగానే వాటర్ అడుగుతున్నారు అనుకుంటుంది. అదే సమయానికి అక్కడకు ఆటోలో వచ్చిన గౌతమ్ అందర్నీ చూసి వామ్మో..అందరూ ఇక్కడ ఉన్నారేంటి..ఈ రిషీ గాడికి దొరికేశానురా బాబు..ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అనుకుని వెళ్తాడు. అందరికి హలో చెప్తాడు.
రేపటి ఎపిసోడ్ లో
అంకుల్ మీరేంటి ఇక్కడకు వచ్చారను..ఇంతకు ముందు కూడా కనిపించారు అంటాడు.. గౌతమ్. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మరో సీన్ లో రిషి కోపం బావుంటుందా-సహనం బావుంటుందా అని అడిగిన జగతికి.. సహనం బావుంటుందని సమాధానం ఇస్తుంది. కానీ నాకు రిషి కోపం బావుంటుందనుకుంటా అంటుంది జగతి. మీకు ఎప్పటికి నేను రక్షణగా ఉంటాను..మిమ్మల్ని ఎవరైనా ఒక మాటన అనాలంటే..నన్ను దాటి వెళ్లాల్సిందే అని తండ్రికి చెప్తాడు రిషీ. చూడబోతే..రేపటి ఎపిసోడ్ లో ఏమోషనల్ కంటెంట్ ఉండేలా ఉంది.
-Triveni Buskarowthu