BREAKING : నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌ కు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

-

వైద్యులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2021 -22 వార్షిక సంవత్సరానికి సంబంధించిన నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీట్ పీజీ వైద్య విద్యార్థులకు కోటాను ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో నీటి పీజీ కౌన్సిలింగ్ పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. నీట్ పీజీ కోటపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని కొన్నేళ్ల నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందినవారికి 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన కూడా ఈ ఏడాది వర్తించనుంది. అయితే ఈ డ బ్ల్యూ ఎస్ రిజర్వేషన్ పై మార్చిలో పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పీజీ అడ్మిషన్ల పై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. దీంతో వైద్యులకు భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news