కార్తీకదీపం ఎపిసోడ్ 1238: శ్రీవల్లి వాళ్లను తనే చంపించినట్లు కార్తీక్ ముందు ఒప్పుకున్న రుద్రాణి..నెక్ట్స్ టార్గెట్ హిమ అని సవాల్

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు డాక్టర్ గా అనర్హుడివి అంటూ అంతా అన్న మాటలు, ఆస్తి మొత్తం ఆ కుటుంబానికి ఇచ్చేయడం అంతా గుర్తుచేసుకుంటాడు. మమ్మీ- డాడీ నన్ను క్షమించండి, చెప్పకుండా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా చేయక తప్పటం లేదనుకుంటాడు. ఇంతలో బాబు గుక్కపట్టి ఏడ్వడంతో కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. నువ్వు ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తున్నాడు అన్న హిమ మాటలు గుర్తుచేసుకుంటాడు. నీకు నాకు ఏంట్రా ఈ అంతు చిక్కని అనుబంధం అంటూ మళ్లీ ఉయ్యాల్లో వేస్తాడు. బుడ్డోడు ఏడుపు మొదలెడతాడు. అమ్మా-నాన్న వచ్చేస్తారు బయటకు వెళ్లారని బాబుకి చెబుతుంటాడు.

- Advertisement -

సౌందర్య ఇంట్లో

మోనిత బస్తీలో ఎందుకు ఆసుపత్రి పెట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని సౌందర్యతో వారణాసి అంటాడు. అక్కడ ఆమె ఆసుపత్రి పెట్టినా ఎవ్వరూ అక్కడకు వెళ్లడంలేదు, ఎవ్వరూ మాట్లాడడం లేదు, పాలు-కూరగాయలు ఏవీ అమ్మడం లేదు, తనతో మాట్లాడటం లేదు, తనకు ఏ సహాయం చేయలేదనుకోండి.. బస్తీ మొత్తం ఒకేమాటమీద ఉన్నాం అని చెబుతాడు. దీప ఫోన్ చేయలేదా అని అడిగితే..ఒకవేళ ఫోన్ చేస్తే దీపక్క చెప్పొద్దన్నా నేను చెబుతా అన వెళ్తాడు.

నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండీ..కార్తీక్ ఎక్కడున్నా బావుంటాడనే ధైర్యం వచ్చింది..వాడు ఎలాంటి కష్టాలు ఎదుర్కోడన్న ధైర్యం వచ్చింది.. చిన్న చిన్న కష్టాలున్నా వాటిని దీప చూసుకుంటుందనే ధైర్యం వచ్చింది అని భర్త ఆనందరావుతో అంటుంది. వారణాసి ఏం చెప్పలేదుగా..ఈ ధైర్యం ఏంటి అని అడుగుతాడు… బస్తీ వాసుల మనసులో ఉండిపోయేలా చేశారంటే..నా పెద్దకోడలు వాళ్లను అంతలా ప్రభావం చేసిందంటే ఇక భర్తని కూడా ఎంతో బాగా చూసుకుంటుందని అంటుంది సౌందర్య. దీప కార్తీక్ ను ఎప్పుడు ఓడిపోనివ్వదని మీరు చెప్పింది కరెక్టే అని భర్తతో అంటుంది. రత్నసీత తీసుకొచ్చిన మహేశ్ కూడా వెతకడానికి వెళ్లాడు కదా త్వరలో కార్తీక్ వాళ్ల ఆచూకీ తెలిస్తే బావుంటుందనుకుంటుంది.

గుడి నుంచి ఇంటికి వెళుతున్న కోటశ్-శ్రీవల్లి బండిని రుద్రాణి మనుషి అబ్బులు లారీతో వెనుక నుంచి వచ్చి గుద్దించేస్తాడు..పాపం వాళ్లు కిందపడిపోయి ఉంటారు. అబ్బులు దిగి చూస్తాడు. స్థానికులు వస్తారు. కొడుకుని తలుచుకుంటూ ఇద్దరూ చనిపోతారు.

కట్ చేస్తే ఆసుపత్రి దగ్గరకు వచ్చిన మోనిత కారు దిగేలోగా వారణాసి నమస్కారం మేడం అంటాడు. బస్తీవాసులు కూడా అక్కడకు వస్తారు. మోనిత వీళ్ల వ్యవహారం ఏంటి తేడాగా కనిపిస్తుంది..మీరు నా బుట్టలో పడతారని నాకు తెలుసు అనుకుంటుంది. ఏం కావాలి అంటుంది మోనిత.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటాడు వారణాసి. పాతిక్కో పరక్కో కకృత్తిపడి మిమ్మల్ని డబ్బులు అడుగుతాం అనుకుంటున్నారా అని లక్ష్ణణ్ అంటాడు. వారణాసి మోనితకు క్లాస్ ఇస్తాడు. బస్తీవాళ్ల గురించి మీకు తెలియదు..ఒకసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఏం చేశామో గుర్తిందికదా..మళ్లీ అలా జరగకుండా చూసుకోండి అంటాడు. మోనిత ఈ ఇల్లు నేను కొనుక్కున్నా ఇక్కడే ఉంటా అంటుంది మోనిత. మీరు ఇవ్వాల కాకపోయినా..రేపైనా నా దగ్గరకు వస్తారు. నాకు అది బాగా తెలుసు అంటుంది మోనిత. అది ఈ జన్మలో జరగదని వాళ్లు వెళ్లిపోతారు.

రుద్రాణి-కార్తీక్

రూమ్ నిండా చిన్నపిల్లల ఫొటోలు చూస్తూ… పోలీస్ తనని కొట్టిన విషయం తల్చుకుంటుంది. ఎందుకు కోటేష్-శ్రీవల్లి నన్నెందుకు ఇబ్బంది పెట్టారు.. నా మీద రాయేస్తే ఇలాంటి పనులే చేస్తానంటుంది. మీరు అప్పు తీర్చలేదు, నాకు కోపం వచ్చింది.. నేను బాబుని తీసుకొచ్చా..నన్ను పోలీస్ స్టేషన్ కి పంపించారు..మీరు పైలోకాని పోయారు..ఏం బాగుపడ్డారని అనుకుంటుంది. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. అసలు నువ్వు మనిషివేనా, ఇద్దరు అమాయకుల్ని చంపావ్, వాళ్ల ప్రాణాలు తీసి ఏం బాగుపడతావ్ అని కార్తీక్ ఏ తెగ ఫైర్ అవుతాడు. రుద్రాణి ఏం తెలియనట్లు మాట్లాడుతుంది.. నేను ప్రాణాలు తీయడమేంటంటుంది. ఇప్పటి వరకూ నువ్వు ఏం చేసినా అడిగేవారు లేరు.. నీకు కోపం వస్తే ఓ మాట అంటే సరిపోతుంది.. ఆ మాత్రం దానికే యాక్సిడెంట్ చేయించి చంపించాలా అంటాడు. మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి..వాళ్ల చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు..నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్తే బాగుంటుంది.. ఎక్కువ మాట్లాడితే కథ వేరే ఉంటుంది సారూ , పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. నటించకు..నీ అంతు చూడనిదే వదిలిపెట్టనంటాడు కార్తీక్. అప్పు తీరుస్తానని సంతకం పెట్టాక కూడా వాళ్లనెందుకు చంపావ్ అంటాడు.

రుద్రాణి తన మనుషులతో కార్తీక్ ను చెక్ చేయించి, కెమేరాలు, సెల్ ఫోన్లు ఉన్నాయోమే చెక్ చేయమంటుంది. ఏమీ లేకపోయే సరికి..అవును నేనే చంపించాను.. నా ఇంటికి పోలీసులు వచ్చారు, ఆ పోలీస్ నన్ను ఘోరంగా అవమానించింది, ట్రాన్ఫర్ అయి వెళ్లిపోయింది, నా పగ ఎవరిపై తీర్చుకోవాలి, నాపై కంప్లైంట్ ఇచ్చిన శ్రీవల్లి-కోటేష్ ల పైనే కదా .. తప్పేలేదు, నువ్వు నా మనుషుల్ని కొట్టావ్..నీ పెళ్లాం నన్ను కొట్టింది. పోనీలో నా గురించి తెలియదులే అనుకున్నాను.. కానీ ఆ శ్రీవల్లి-కోటేశ్ నా అభిమానంపై దెబ్బకొట్టారు తట్టుకోలేకపోయాను. రుద్రాణికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. నీకేదో బ్యాంగ్రౌండ్ ఉన్నట్టు దీప మాట్లాడుతోందే అంటుంది. కార్తీక్ చేసిన తప్పు ఒప్పుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపో లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటాడు. అసలు ఈ కార్తీక్ కి బుర్ర ఉందా..పోయి పోయి ఆ రుద్రాణికి చెప్తే..ఆమె ఒప్పుకుంటుందా.. రెచ్చిపోయిన రుద్రాణి … నా బాకీ తీర్చకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అని రెట్టిస్తుంది. ఒప్పందం ప్రకారం అదే మాటమీద కట్టుబడి ఉంటాను..మీ కూతురు హిమను నేను దత్తత తీసుకుంటా అంటుంది. కార్తీక్ కి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

ఈ సీరయల్ ఏంటో..వాళ్లను ఎందుకు పెట్టారో..ఎందుకు చంపారో..కార్తీక్ వాళ్లు ఫైనల్ గా ఏం చేస్తారో, మధ్యలో ఈ రుద్రాణీ ఓవర్ యాక్షన్ ఏంటో..ప్రేక్షకులకు ఇప్పటికే విసుగొచ్చింది. అసలు ఈ రుద్రాణి విలనిసమ్ కంటే..కాస్త మోనితాదే బాగుంటుందని అనుకుంటున్నారు చూసేవాళ్లు. డైరెక్టర్ సాబ్ ఈ సీరయల్ ను ఇంకెంత దూరం తీసుకెళ్తాడో.!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...