ఆధార్‌ కార్డుపై ఫోటో ఇలా మార్చుకోండి!

-

మీ ఆధార్‌ కార్డు పై ఉన్న ఫోటో పాతదా? లేదా ఆ ఫోటో మీకు నచ్చకపోతే సులభంగా దాన్ని మార్చుకోండి. ఫోటోను రెండు పద్ధతుల్లో మార్చుకోవచ్చు. ఫోటో మార్చాలని రిక్వెట్‌ లెటర్‌ రాసి మార్చుకోవచ్చు, లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌కు వెళ్లి అప్డెడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత సమయంలో ఆధార్‌ చాలా ముఖ్యమైంది. ఓటర్‌ ధ్రువీకరణ కార్డు కంటే ఇదే ప్రతిదానికి తప్పనిసరి అయ్యింది.


ఆధార్‌ కార్డులో ఫోన్‌ నంబర్, ఇంటి అడ్రస్‌ మార్చుకున్నట్లే, ఫోటోను మార్చుకోవచ్చు. ఆధార్‌ కార్డుపై కొంత మంది ఫోటోలు సరిగా ఉండవు. అలాంటివారు ఆధార్‌పై ఫోటోను సులభంగా మార్చుకోవచ్చు. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఆధార్‌ పై ఫోటో మార్చుకునేందుకు మీకు దగ్గరలో ఉన్న ఆధార్‌ నమోదు సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారమ్‌ను డిటెయిల్స్‌ నమోదు చేసి, ఫారమ్‌ను ఆధార్‌ ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి.

  • దీనికి మీరు బయోమెట్రక్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ మీ ఫోటో తీసుకొని, అప్డెట్‌ చేస్తాడు. ఆ తర్వాత మీకు ఒక యూఆర్‌ఎన్‌ నంబర్‌ ఇస్తాడు.
  • దీంతో మీరు ఆధార్‌ అప్డెట్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. దీనికోసం జీఎస్‌టీతోపాటు రూ.25 చెల్లించాలి.

రెండో విధానం

  • యూఐడీఏఐ రిజనల్‌ కార్యాలయానికి లేఖ రాసి కూడా ఆధార్‌ను అప్డెట్‌ చేసుకోవచ్చు.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి ఆధార్‌ డేటా అపెడేట్‌ కరెక్షన్‌ ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ఫారమ్‌ను ఫిల్‌ చేసి, లెటర్‌ రాసి ఈ రెండూ అటాచ్‌ చేసి రిజినల్‌ కార్యాలయానికి పంపాలి. దీంతోపాటు ఫోటో కాపీ కూడా జతచేయాలి.
  • అప్‌డేట్‌ అయిన తరువాత 20 రోజుల్లో కొత్త ఫోటోతో కూడిన ఆధార్‌ కార్డు మీ ఇంటికే పోస్తు ద్వారా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news