పోస్‌ఆఫీస్‌, బ్యాంకుల్లో డబ్బులు సేవ్‌ చేస్తున్నారా..? ఆధార్‌ ఇవ్వకపోతే ఇక అకౌంట్‌ పనిచేయదు

-

పోస్ట్‌ఆఫీస్‌, బ్యాంకుల్లో డబ్బులను పొదుపు చేస్తున్నారా..? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్‌ ప్రకారం కొన్ని మార్పులు చేయకపోతే.. మీ సేవింగ్‌ ఖాతాలు పనిచేయకపోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ), సుకన్య సమృద్ధి స్కీమ్ వంటి తదితర పథకాల్లో డబ్బులు దాచుకునే వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆధార్ కార్డును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

మీరు ఎక్కడ అయితే సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ తెరిచారో అక్కడకు వెళ్లి అంటే పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి ఆధార్ కార్డు సమర్పించాలి. సెప్టెంబర్ 30 లోపు ఇలా చేయాలి. ఒక వేళ ఆధార్ కార్డు ఇవ్వకపోతే.. అప్పుడు మీ స్మాల్ సేవింగ్ స్కీమ్ అకౌంట్ పని చేయదు. ఫ్రీజ్ చేస్తారు. మీరు ఆధార్ కార్డును ఎప్పుడైతే ఇస్తారో.. అప్పటి వరకు మీ సేవింగ్ స్కీమ్ అకౌంట్ పని చేయదు. అందువల్ల మీరు పోస్టాఫీస్ లేదా బ్యాక్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే కచ్చితంగా ఆధార్ కార్డును అందించండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా పని పూర్తి చేసుకోండి.

పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఇతర సేవింగ్ స్కీమ్స్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. అందువల్ల ప్రస్తుతం ఎవరైతే సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెడుతున్నారో వారు కచ్చితంగా ఈ రూల్‌ను అనుసరించాల్సిందే. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సేవింగ్స్ ఖాతాను తెరిచి డబ్బలు ఇన్వెస్ట్ చేసే వారు ఇప్పటి వరకు ఆధార్ కార్డును సమర్పించకపోతే అలాంటి వారు కచ్చితంగా సెప్టెంబర్ 30లోపు ఆధార్ కార్డును అందించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్‌లో తెలియ జేసింది. అందువల్ల మీరు ఖాతా తెరిచి దగ్గరి నుంచి ఆధార్ ఇవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.

ఆధార్ ఇవ్వకపోతే సేవింగ్ స్కీమ్స్‌పై వచ్చిన వడ్డీ రాబడి మీ అకౌంట్‌లోకి జమ కాదు. అలాగే సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కూడా వీలు కాకపోవచ్చు. మెచ్యూరిటీ అమౌంట్ డబ్బులు కూడా మీకు ఇవ్వకపోవచ్చు. అలాగే నిలిపి వేస్తారు. అలాగే సేవింగ్ స్కీమ్స్ అకౌంట్ల ఫ్రీజ్ అవుతాయి. అందుకు వెంటనే ఆధార్ కార్డు ఇచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news