క్రెడిట్ కార్డు ఉందా? ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారా? చిక్కుల్లో పడినట్టే..

-

అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డ్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి క్రెడిట్ కార్డుని ఉపయోగించడం రాదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జేబులో కార్డుని తీసి, గీసేస్తుంటారు. క్రెడిట్ కార్డ్ ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. ఎక్కడ వాడకూడదో కూడా తెలుసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం.

వెబ్ సైట్లో అని లేనపుడు

ఆన్ లైన్ పేమెంట్ చేయాలని చూస్తున్నప్పుడు ఆ వెబ్ సైట్ ని జాగ్రత్తగా గమనించండి. అడ్రెస్ బార్ లో లేనట్లయితే పేమెంట్ చేయవద్దు. లేదంటే అదేదో భద్రత సమస్యలు ఉన్నాయనే అర్థం.

వీధిలో ఎవరైనా ఛారిటీ వాళ్ళు తారసపడినపుడు

అప్పుడప్పుడు వీధుల్లోకి ఛారిటీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి డబ్బులిచ్చే సమయాల్లో క్రెడిట్ కార్డు వాడవద్దు. వాళ్ళెంత వరకు నిజమో కాదో తెలియదు కాబట్టి, ఇవ్వాలనుకుంటే నగదు ఇవ్వండి.

ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు

మీ క్రెడిట్ కార్డు విషయాలు ఫోన్లో ఎవరితో పంచుకోవద్దు. పక్కన ఎవరూ లేరనో, ఎవరూ వినట్లేదనో అనుకోవద్దు. మనమేం చేసినా ఎప్పుడూ రెండు కళ్ళు చూస్తుంటాయన్న భావనతో ఉండండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వాడుతున్నప్పుడు. మీరు చెప్పే విషయాలు నోట్ చేసుకుని, ఆ తర్వాత ఏదైనా చేసే ప్రమాదం ఉంది.

మీరు సంపాదన కన్నా ఎక్కువ ధరకి వస్తువు కొనాలనుకున్నప్పుడు

మీ ఆదాయం తక్కువగా ఉంటే, అంతకు తక్కువ అమౌంట్ మాత్రమే క్రెడిట్ కార్డ్ ద్వారా వాడాలి. లేదంటే ఆ డబ్బులు కట్టలేక చిక్కుల్లో పడాల్సిఅ వస్తుంది. కొనేటప్పుడు చాలా బాగుంటుంది. కట్టేటపుడు చుక్కలు కనిపిస్తాయి.

రెస్టారెంట్లలో వెయిటర్ మీ కార్డు తీసుకోవాలనుకుంటే,

భోజనం చేసారు. బిల్ కట్టాలని వెయిటర్ ని అడిగితే మెషిన్ కౌంటర్ వద్ద ఉంది. కార్డు నాకివ్వండి. నేను పే చేస్తాను అని చెప్తే నమ్మవద్దు. మీ ఎదుట కాకుండా పక్కకి తీసుకెళ్ళి బిల్ పే చేసే వాళ్ళకి మీ క్రెడిట్ కార్డు ఇవ్వవద్దు. వాళ్ళు కార్డు నంబర్లు నోట్ చేసుకున్నా, ఫోటో తీసుకున్నా మనకే ప్రమాదం.

Read more RELATED
Recommended to you

Latest news