ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఆ సర్వీసులకు చెక్..

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు..ప్రైవేట్‌ సంస్థలకు చెందిన థర్డ్‌ పార్టీ క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ గూగుల్‌ డ్రౌవ్‌, డ్రాప్‌ బాక్స్‌లను వినియోగించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది.అంతేకాదు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ను వాడకూడదు అని హెచ్చరించారు.

వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నార్డ్‌ వీపీఎన్‌, ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌లు భారత్‌లు వీపీఎన్‌ నెట్‌ వర్క్‌లను తొలగించాయి.ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త వీపీఎన్‌ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..వీపీఎన్‌ చట్టాలకు సంబంధించి నేషనల్‌ ఇన్ఫ్రమెటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అన్నీ మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని,ఈ కీలక ఉత్తర్వులపై మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆమోదం తెలిపినట్లు నివేదికలు తెలిపాయి..

వీపీఎన్‌ సంస్థలకు కేంద్రం విధించిన నిబంధనలు ఇవే..

గత మే నెలలో కేంద్రం వీపీఎన్‌ సంస్థలపై నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి సదరు సంస్థలు వ్యవహరించాలని ఆదేశించింది..లేదంటే భారత్ అన్నీ సంభంధాలను మానుకోవాలని సూచించింది.

సబ్‌స్క్రయిబర్‌, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి

సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి

యూజర్లకు ఐపీలను కేటాయించాలి

రిజిస్ట్రేషన్‌ టైంలో.. ఈ-మెయిల్‌, ఐపీ అడ్రస్‌, టైమ్‌ స్టాంప్‌ వివరాలను పొందుపర్చాలి

అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్‌ తెలియజేయాలి.

సరైన చిరునామా, కాంటాక్ట్‌ నెంబర్లు ఇవ్వాలి.సబ్‌స్క్రయిబర్ల ఒనర్‌షిప్‌ ప్యాటర్న్‌ను సమర్పించాలి.అంటూ కేంద్రం వీపీఎన్‌ సర్వీసు సంస్థల్ని ఆదేశించింది. వీటితో పాటుగా ఎనిడేస్క్ ను కూడా వాడోద్దని చెప్పుకొచ్చింది..వీపీఎన్‌, క్లౌడ్ సర్వీసెస్‌తో టీమ్ వ్యూయర్‌, ఎనీడెస్క్‌, యామ్‌వీ అడ్మిన్‌లను సైతం వినియోగించొద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news