ఏటీఎం కార్డులు వాడకున్నా అకౌంట్లలో 10 లక్షలు మాయమయ్యాయి..!

-

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కతున్నా కొద్దీ.. దాన్ని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయి. రోజురోజుకూ తలనొప్పిగా మారిన సైబర్ నేరాలే దానికి నిదర్శనం. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకింగ్ మోసాలు ఈరోజుల్లో విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే.. అవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నవి కాబట్టి. సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బు సంపాదించడం కోసం వేస్తున్న ఎత్తుగడలు అవి.

cyber criminals theft 10 lakhs by using skimming technique

తాజాగా ఢిల్లీలో సైబర్ నేరగాళ్లు వల వేసి 10 లక్షలు మాయం చేశారు. దాదాపు 12 మంది అకౌంట్ల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలను కొట్టేశారు. 12 మంది ఒకే ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడమే దానికి కారణం. వాళ్లలో ఎవ్వరు కూడా ఏటీఎంను ఉపయోగించి డబ్బులు డ్రా చేయకున్నప్పటికీ.. వాళ్ల అకౌంట్‌లో నుంచి డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లందరి అకౌంట్లలో కలిపి 10 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. దీంతో వాళ్లు సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేయడంతో… వెంటనే బ్యాంకుల సిబ్బంది వాళ్ల కార్డులను బ్లాక్ చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు.. వాళ్లు ఏటీఎంకు వెళ్లకున్నా.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయకున్నా.. వాళ్ల అకౌంట్‌లో నుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయి..

అదే స్కిమ్మింగ్ టెక్నిక్

అవును.. స్కిమ్మింగ్ టెక్నిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులను కొట్టేస్తారు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉంటుంది. మీ కార్డు వివరాలన్నీ వాళ్ల దగ్గర ఉంటాయి. ఆ వివరాల ద్వారా మీ డబ్బులు కొట్టేస్తారు. దాని కోసం వాళ్లు ఓ చిన్న పరికరాన్ని ఉపయోగిస్తారు. దాని పేరు స్కిమ్మర్. దాన్ని ఏటీఎం కార్డు పెట్టే స్లాట్ దగ్గర అమర్చుతారు. మీరు ఏటీఎం కార్డు స్లాట్‌లో కార్డును పెట్టినప్పుడు కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌లో ఉన్న వివరాలను స్కాన్ చేసి.. ఆ పరికరంలోపల స్టోర్ చేస్తుంది. లేదా వెంటనే దాని నుంచి సెట్ చేసినట్టుగా వేరే వాళ్లకు పంపిస్తుంది. ఆ వివరాలతో సైబర్ నేరగాళ్లు డబ్బులను తస్కరిస్తారన్నమాట.

స్కిమ్మర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

అందుకే.. ఏటీఎం సెంటర్‌కు వెళ్లగానే ముందుగా అక్కడ ఉన్న ఏటీఎం మిషన్‌ను చెక్ చేయండి. కార్డు స్లాట్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయండి. స్లాట్ దగ్గర ఏదైనా పరికరం అమర్చబడి ఉందో చెక్ చేయండి. స్లాట్ లోపల ఏం లేకపోతేనే ఏటీఎం కార్డును పెట్టండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు కానీ.. లేదంటే ఏటీఎంకు సంబంధించిన బ్యాంకు అధికారులకు విషయాన్ని తెలియపరచండి.

అలాగే పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కూడా పిన్ నెంబర్ కనిపించకుండి.. చేతితో కవర్ చేయండి. మీ కార్డును కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. ఇచ్చినా కూడా వెంటనే తీసేసుకోండి.

పీవోసీ కేంద్రాలయినటువంటి పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో కార్డు ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వైపింగ్ మిషన్లలోనూ స్కిమ్మర్లను పెట్టే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news