ఒమన్ వెళ్లాలనుకుంటున్నారా…? అయితే ఈ విషయాలు మీకోసం..!

-

నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశము చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. సముద్ర తీరాలు, ఎత్తైన కొండలు చూడ దగ్గవి. దీనిని వీక్షించడానికి మన భారత దేశం నుండి కూడా అనేక మంది వెళ్తూ ఉంటారు. కాగా మరి కొందరు వివిధ పనులు మీద వెళ్తూ ఉంటారు. అయితే కారణం ఏదైనా ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక సూచన చేసింది. మరి ఆ సూచనలు ఏమిటి..? తీసుకున్న నిర్ణయాలు ఏమిటి..? ఇలా అనేక విషయాలు మీకోసం.

వివరాల లోకి వెళితే.. సందర్శకులకు సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక సూచన చేసింది. ఒమన్ వచ్చే వారు ఇక పై ఎనిమిది రోజుల పాటు తప్పక స్టే (క్వారంటైన్ పీరియడ్ ఏడు రోజులు) చేయాల్సి ఉంటుందని సీఏఏ తన సర్క్యులర్ ‌లో పేర్కొంది. ఇప్పటికే విమానయాన సంస్థలకు సమాచారం కూడా అందించడం జరిగింది. అయితే టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడే ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పాలని కూడా సూచించింది. అయితే ఎవరు అయితే దీనికి అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్ బుక్ చేయాలని కోరింది.

అలానే క్వారంటైన్ పీరియడ్ కంటే ముందు దేశం విడిచి వెళ్లకూడదని ప్రయాణికులకు స్పష్టం చేసింది. ఏడు రోజులు పూర్తయ్యాక పీసీఆర్ టెస్టు రిజల్ట్ బేస్ చేసుకుని ప్రయాణానికి అనుమతి ఇస్తామని సీఏఏ వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు 1.32 లక్షల మందికి కరోనా వచ్చింది. 1,517 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news