ఫేస్‌బుక్‌ పోస్టులను ఇతర యాప్స్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేయాలో తెలుసా?

-

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నయా ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ వినియోగదారులకు డేటాను వేరే ప్లాట్‌ఫాంకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ఇందుకు అవసరమైన రెండు కొత్త డేటా పోర్టబిలిటీ టైప్స్‌ను ఏప్రిల్‌ 19న ప్రవేశపెట్టింది.


దీంతో యూజర్లు నేరుగా తమ ఎఫ్‌బీ పోస్టులు, నోట్స్‌ను గూగుల్‌ డాక్యుమెంట్స్, బ్లాగర్, వర్డ్‌ ప్రెస్‌ వాటన్నింటినీ ఇతర ప్లాట్‌ఫాంలకు పంపవచ్చు. ట్రాన్స్‌ఫర్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌ పేరుతో భాగస్వామ్య సంస్థలకు ఫేస్‌బుక్‌ వినియోగదారులకు డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధి స్టీవ్‌ స్టార్‌ఫీల్డ్‌ తెలిపారు. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, డేటా ఉపయోగం దృష్ట్యా దీన్ని రూపొందించామని చెప్పారు.

ముందు వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలను బ్యాక్‌ బ్లేజ్, డ్రాప్‌ బాక్స్, గూగుల్‌ ఫోటోస్, కూఫర్‌ వంటి ప్లాట్‌ఫాంలకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశాన్ని సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కొనసాగింపుగా పోస్టులు, నోట్స్‌ను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు వీలు కల్పించింది.

ట్రాన్స్‌ఫర్‌ చేసే విధానం

  • ముందుగా ఫేస్‌బుక్‌ సెట్టింగ్స్‌లోని ‘యువర్‌ ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌’ విభాగంలో డేటా ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్ ఉంటుంది.
  • అక్కడ ‘ట్రాన్స్‌ఫర్‌ యువర్‌ డేటా’ ఆప్షన్ పై క్లిక్‌ చేయగానే.. డేటా ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ మొదలవుతుంది.
    డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసే ముందు వినియోగదారులు ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ను మరోసారి ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • తరువాత డేటా ఎన్‌ క్రిప్ట్‌ అవుతుంది. అనంతరం డేటా సురక్షితంగా వేరే ప్లాట్‌ఫాంకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

భవిష్యత్తులో డేటా టైప్స్, పార్ట్నర్‌ సంస్థల సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా పోర్టబిలిటీ కోసం ఈ డెవలప్‌ మెంట్‌ చేశామని ఫేస్‌బుక్‌ తెలిపింది

Read more RELATED
Recommended to you

Latest news