గుడ్ న్యూస్: ఫ్యామిలీ పెన్షన్ పెంపు… వివరాలు ఇవే…!

-

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీనితో ఇక నుండి ఎక్కువ పెన్షన్ లభించనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వపు తాజా ప్రకటన తో ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది.

అయితే ఇంట్లో భార్యభర్తలు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే.. వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది. అయితే దీని లిమిట్ రూ.45 వేలు దాటకూడదు అని ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్స్ లేవు. ఈ లిమిట్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది అని కేంద్రం వెల్లడించింది. దీనితో చాల మందికి ఊరట కలగనుంది.

ఈ నిర్ణయం తో గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఉద్యోగం చేసే వారు మరణిస్తే.. అప్పుడు పెన్సన్ భాగస్వామికి వస్తుంది. కానీ వాళ్ళు ఇద్దరు చనిపోతే ఆ డబ్బులు పిల్లలకి వస్తాయి. ఇప్పటి దాకా 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ అందించే వారు. కానీ ఇప్పుడు 7వ వేతన సంఘం సిఫార్సులు ప్రాతిపదికన ఫ్యామిలీ పెన్షన్ అందిస్తారు. రూ.90 వేలను పరిగణలోకి తీసుకుని ఇందులో 50 శాతం అంటే రూ.45 వేల వరకు పెన్షన్ అందించేవారు. అయితే ఇప్పుడు మాత్రం గరిష్ట వేతనంగా రూ.2.5 లక్షలను పరిగణ లోకి తీసుకుంటారు. ఇందులో సగం అంటే రూ.1.25 లక్షల వరకు ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news