సాధారణంగా ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ భార్యాభర్తల గొడవల్లాగే తండ్రీ కొడుకుల మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి. చిన్న చిన్న గొడవలు అయితే ఫర్వాలేదు. సర్దుకుంటాయి. కానీ పెద్ద గొడవలు అయితే విడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
ఇంట్లో ఈశాన్య దిక్కు వాస్తు పరంగా కీలకమైంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య గొడవలను సృష్టిస్తుంది. ముఖ్యంగా తండ్రీ కొడుకులు గొడవలు పడుతుంటారు. అందువల్ల ఈ దిక్కులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల ఇంట్లో తండ్రీ కొడుకులు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటారు.
ఇక ఈశాన్య దిక్కులో చెత్తను ఎప్పుడూ ఉంచరాదు. ఆ ప్రదేశం వైపుకు ఉండే విధంగా కూడా చెత్తను పెట్టరాదు. లేదంటే ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తాయి. ఎల్లప్పుడూ గొడవలు పడుతుంటారు. కనుక ఆ దిక్కను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు ఏర్పడకుండా ఉంటాయి. అన్యోన్యంగా ఉంటారు.