పది నిమిషాల్లో ఇలా ఇ-పాన్ కార్డ్ ని పొందండి..!

పాన్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ముఖ్యమైన లావాదేవీల కోసం పాన్ కార్డ్ ఎంత అవసరంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు పాన్ కార్డు లేదా..? వెంటనే కావాలా..? అయితే పాన్ కార్డ్ కోసం రోజుల తరబడి ఎదురు చూడక్కర్లేదు. ఎంతో ఈజీగా పాన్ కార్డు ని పొందొచ్చు. మనం గతం లో చూసుకున్నటైతే పాన్ కార్డు కావాలంటే రెండు వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఇ-పాన్ కార్డ్ ని తీసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

pan-card

ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డు ఇచ్చే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైనా వెంటనే పాన్ కార్డు కావాలంటే ఇలా చెయ్యండి. దీనితో మీరు పది నిమిషాల్లోనే ఇ-పాన్ ని పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పని సరిగా ఉండాలి. ఆధార్ కార్డు డేటా ద్వారా పాన్ కార్డ్ జారీ చేస్తుంది ఆదాయపు పన్ను శాఖ. 10 నిమిషాల్లో మీకు ఇ-పాన్ వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ పాన్ కార్డ్ మీ అడ్రెస్ కి వస్తుంది. పాన్ కార్డు లేనివారికి మాత్రమే ఈ సర్వీస్ ని ఉపయోగించుకోడానికి అవుతుంది. ఇక అది ఎలా అనేది చూస్తే..

ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయాలి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ Quick Links కనిపిస్తుంది.
అందులో Instant PAN through Aadhaar లింక్‌పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Get New PAN పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaar OTP పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి.
ఇప్పుడు మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
చివరగా సబ్మిట్ చేసిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది.
Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.