కస్టమర్లకు గుడ్ న్యూస్..మొబైల్ నుంచే NPS అకౌంట్..

-

ప్రస్తుతం సైన్స్ వేగంగా అభివృద్ధి చెందింది.. దాంతో టెక్నాలజీ కూడా పెరిగింది.బ్యాంకింగ్ నుంచి ఇతర అనేక రంగాలకు సంభందించిన సేవలను ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో ఇంట్లోనే ఉండి మొబైల్‌లో సులభంగా సేవలను పొందే విధంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాపెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ తో కలిసి శుక్రవారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

ఇది వినియోగదారులు మొబైల్‌ను ఉపయోగించి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ఖాతాలను తెరవడానికి అనుమతి ఇస్తుంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఎన్‌పీఎస్‌ నమోదు కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫారమ్‌ను ప్రారంభించాయి..QR కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కస్టమర్లు ఇప్పుడు ఎటువంటి అవాంతరాలు లేని, పేపర్‌లెస్‌ పద్దతిలో ఎన్‌పీఎస్‌ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాయి.

అయితే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి వెబ్‌పేజీలోకి వెళ్లవచ్చు. అలాగే ఫోటో, ఇతర వివరాలను డిజిలాకర్‌ నుంచి పొందడం కోసం ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేసే ప్రక్రియ సులభంగానూ, వేగవంతంగానూ, కాగితరహితమైనదని తెలిపింది.ఈ స్కీమ్ కింద వినియోగదారులకు వారి భవిష్యత్తును మెరుగు పర్చడానికి, సురక్షితంగా ఉంచడానికి మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news