రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం..

-

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్.. మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు కేటాయించింది..

కేబినెట్‌ సమావేశం తర్వాత చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ ప్రాజెక్టు గురించి మీడియాకు వివరించారు. 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు, గత సంవత్సరాల్లో గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు క్వింటాల్‌కు రూ.20 బోనస్‌ను కూడా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.

గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే..?

*. లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి.

*. వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి

*. అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాలి.

ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఉచిత LPG సిలిండర్‌లను ఎలా పొందాలి?

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే ఈ నెలలో అంటే జూలైలోనే మీ అంత్యోదయ కార్డ్‌ని LPG కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి. మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే మీరు ఈ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కోల్పోతారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది.త్వరలోనే వారందరికీ గ్యాస్ కనెక్షన్స్ ను అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news