‘కారు’కు కేసీఆర్ ఇమేజ్ నో యూజ్!

-

రాజకీయాల్లో అన్నిరోజులు ఒకేలా ఉండవు…ఎప్పుడు ప్రజలు ఒకే మైండ్ తో ఉండరు..అలాగే ఒకే అస్త్రాన్ని వాడుకుని గెలవడం అనేది కూడా సాధ్యమైన పని కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్తితులే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఇంతకాలం తెలంగాణ తెచ్చింది మేమే…తెలంగాణ కోసం పనిచేస్తుంది మేమే అని టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందుతూ వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు సెంటిమెంట్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

పూర్తిగా సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్ పై ఆధారపడి రెండు సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సత్తా చాటి అధికారంలోకి రాగలిగారు. అలాగే కేసీఆర్ సెంటిమెంట్ లేపడంలో సిద్ధహస్తులు..రెండుసార్లు అలాగే సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చేశారు. మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక రెండోసారి కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో…అదిగో మళ్ళీ ఆంధ్రా పాలకులు వస్తున్నారని చెప్పి …మరొకసారి సెంటిమెంట్ లేపి కేసీఆర్ రాజకీయ లబ్ది పొంది 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు.

ఇక అన్నివేళలా ఇలాంటి సెంటిమెంట్లు వర్కౌట్ కావు…కానీ మళ్ళీ కేసీఆర్ అదే పనిలో ఉన్నారు…ఈ సారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బూచిగా చూపించి లబ్ది పొందాలని చూస్తున్నారు. అయితే ఈ సారి అలాంటివి వర్కౌట్ కావని తాజాగా ఆరా సంస్థ సర్వేలో తేలింది. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ బొమ్మను చూసి ఓటర్లు ఓటేశారని, కానీ ఈసారి ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఉండదని తాజా సర్వేలో తేలింది.

అంటే కేసీఆర్ ఇమేజ్  ఏ మాత్రం ఉపయోగపడదని, కేసీఆర్ ఇమేజ్ అడ్డుపెట్టుకుని గెలవాలనుకునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ సారి చుక్కలు కనబడతాయని తెలుస్తోంది. పైగా రోజురోజుకూ టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని తాజాగా టీఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్న ఓట్ల శాతం బట్టి అర్ధమవుతుంది. ఏదేమైనా ఈ సారి కేసీఆర్ ఇమేజ్ వల్ల యూజ్ ఉండదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news