15 రోజుల్లోనే జనం ఎంత డబ్బు విత్‌డ్రా చేసారంటే…?

-

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది బలైపోతున్నారు. రోజు రోజుకి కేసులు ఎక్కువగా నమోదయిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నాయి. దీనితో ప్రజలు బ్యాంక్స్ కి వెళ్లి విత్డ్రా చేసుకుంటున్నారు.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజా నివేదిక లో ఒక ఆసక్తికర అంశం తీసుకు రావడం జరిగింది. కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో బ్యాంకుల నుంచి డబ్బులు భారీగా విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఆర్‌బీఐ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే కేవలం గత పదిహేను రోజుల్లో భారీగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు అని తెలిపింది.

ముగిసిన ఈ పదిహేను రోజుల్లో ప్రజల వద్ద ఉన్న డబ్బులు రూ.30,191 కోట్లు పెరుగుదలతో రూ.27.87 లక్షల కోట్లకు చేరింది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9 మధ్య కాలంలో ప్రజల వద్ద వున్నా డబ్బులు దాదాపు రూ.52,928 కోట్లు పెరిగాయి.

లాక్ డౌన్ ఉంటే ఇబ్బంది పడాలని ముందుగానే డబ్బులని విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇదే ఇన్ని విత్డ్రాలకి కారణం. అలానే గత ఏడాది కూడా కరోనా పీక్స్‌ లో ఉన్నప్పుడు ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు ఎక్కువగానే విత్‌డ్రా చేసుకున్నారు.

అప్పుడు డేటా చూస్తే… 2020 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ.22.55 లక్షల కోట్ల నుంచి రూ.25.62 లక్షల కోట్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news