తెలంగాణలో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన డీహెచ్ !

తెలంగాణలో మే ఒకటో తేదీ నుంచి లేదా 2వ తేదీ నుంచి లాక్ డౌన్ ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం కూడా అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. అయితే 30 వ తేదీన జరిగే సమీక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న మహమ్మద్ అలీ ప్రస్తుతానికైతే కేసీఆర్ కి లాక్ డౌన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

తాజాగా ఇదే వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని పేర్కొన్నారు. అసలు లాక్ డౌన్ గురించి ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.. లాక్ డౌన్ కి సంబంధించి ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కోవిడ్ కేసుల్లో స్థిరత్వం వచ్చిందని పేర్కొన్న ఆయన మరో మూడు నాలుగు వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని అన్నారు.