కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్..ఆ వస్తువుల పై భారీ డిస్కౌంట్..

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్  ఐసిఐసిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది..మాన్ సూన్ లో ఆ వస్తువుల పై కళ్ళు చెదిరే ఆఫర్ ను ప్రకటించింది..ఎలక్ట్రానిక్స్, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్స్, ట్రావెల్, గ్రాసరీ, ఆటోమొబైల్, ఫర్నీచర్ లాంటి ప్రొడక్ట్స్ కొనేవారికి భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.కస్టమర్లు తమ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో లావాదేవీలు చేస్తే చాలు. ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ కార్డులతో స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ పై ఎలాంటి ఆఫర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నుంచి వచ్చిన అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొంటే మోడల్‌ను బట్టి రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 2022 జూలై 31 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలకు ఈ ఆఫర్ లభిస్తుంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.12,000 కొనుగోలు చేయాలి. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

వివో ఎక్స్, వీ, వై, టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కొంటే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 2022 జూలై 31 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలకు ఈ ఆఫర్ లభిస్తుంది.
ఐకూ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం రూ.13,999 కొనుగోలు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొంటే 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కనీసం రూ.7,499 ట్రాన్సాక్షన్ చేయాలి. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొంటే 10 శాతం గరిష్టంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం రూ.10,000 ట్రాన్సాక్షన్ చేయాలి. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వస్తుంది.

ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ లో ఉన్న యాపిల్ ఫోన్ అయిన ఐఫోన్ 13 కొనేవారికి రూ.2,341 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news