మొబైల్ నెంబర్ మారిస్తే వెంటనే ఆధార్‌తో లింక్ చేసుకోండి… లేదంటే వీటిని పొందలేరు..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు లేకపోతే, బ్యాంకింగ్ సేవలు పొందలేరు. అలానే ప్రభుత్వ పథకాలు రావు. కనుక ఆధార్ కార్డు అప్‌డేట్ గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండటం అత్యంత అవసరం. అదే విధంగా మీరు వాడే మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుకి లింక్ చేయడం కూడా ముఖ్యం.

 

ఏదైనా ట్రాన్సక్షన్ చెయ్యాలంటే దానికి సంబంధించిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. కనుక మీరు మొబైల్ నెంబర్ మార్చినా లేదా పోగొట్టుకున్నా లేదా ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను వాడకపోయినా వెంటనే అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ట్రాన్సక్షన్స్ అవ్వవు.

అయితే ఎలా ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను మార్చాలి అనే విషయంలోకి వస్తే.. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చెయ్యడానికి మొదట ఆధార్ నమోదిత కేంద్రానికి వెళ్లాలి. ఫోన్ నెంబర్‌ను లింక్ చేసుకునే దరఖాస్తును మీకు ఇస్తారు. అయితే ఈ ఫామ్ ని ‘ఆధార్ కరెక్షన్ ఫామ్’ అంటారు. సమాచారంతో నింపిన దరఖాస్తును రూ. 25 చెల్లించి, ఆధార్ నమోదిత కేంద్ర ఆఫీసర్‌కి ఇవ్వాలి.

మీకొక రశీదు ఇస్తారు. ఈ స్లిప్‌లో అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. మీ రిక్వెస్ట్ నెంబర్‌తో, మీ కొత్త మొబైల్ నెంబర్ మీ ఆధార్‌తో లింక్ అయిందో లేదో చూడచ్చు. మీ కొత్త మొబైల్ నెంబర్‌తో మీ ఆధార్ కార్డు మూడు నెలలో లింక్ అవుతుంది. అప్డేట్ అయ్యాక ఓటీపీ వస్తుంది. ఆధార్ టోల్‌ఫ్రీ నెంబర్ 1947కి కాల్ చేసి కూడా లింక్ అయ్యిందో లేదో చూడచ్చు.