వాట్సాప్ తో జియో రీఛార్జ్..

వినియోగదారులకు అత్యుత్తమమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో వ్యాపార సంస్థలన్నీ తమ సాంకేతికతని విస్తృతం చేస్తున్నాయి. వినియోగదారుడి ఇంటివద్దకే అన్ని సేవలు అందించేలా చేస్తున్నాయి. భారత దేశ టెలికాం దిగ్గజం జియో సంస్థ అదే విధమైన సాంకేతికతతో ముందుకు వచ్చింది. ఇక నుండి జియో రీఛార్జ్ చేయడానికి వాట్సాప్ నంబరుని ప్రవేశ పెట్టింది. ఈ నంబరుకి మెసేజ్ చేస్తే చాలు మీ జియో సిమ్ రీఛార్చ్ చేసుకోవచ్చు.

అంతేకాదు కంప్లైంట్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా, ఇక్కడి నుండే రీఛార్జ్ సంబంధిత పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.

70007 70007అనే నంబరును జియో సేవలన్నింటికీ ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ప్రతీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అందువల్ల జియోకి సంబంధించిన ఏ సేవలనైనా వాట్సాప్ ద్వారా అందించేందుకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది.

వాట్సాప్ నంబరుతో ఎలాంటి సేవలు పొందవచ్చంటే:

జియో సిమ్ రీఛార్జ్
కొత్త జియో సిమ్ లేదా జియో సిమ్ కి మారే అవకాశం
జియో సిమ్ సపోర్ట్ సేవలు
జియో ఫైబర్ సపోర్ట్ సేవలు
అంతర్జాతీయ రోమింగ్ సపోర్ట్ సేవలు
జియో మార్ట్ సపోర్ట్ సేవలు

ప్రస్తుతానికి ఈ వాట్సాప్ నంబరు ద్వారా ఇంగ్లీష్, హిందీల్లో సమాచారం పొందవచ్చు. మరికొద్ది రోజుల్లోనే అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. మొత్తానికి ఒకే నంబరుతో అన్ని సేవలు లభ్యం అవుతున్నాయన్నమాట.