వాటే ఇన్సూరెన్స్ పాలసీ…రూ.100 కడితే రూ.75 వేలు పొందొచ్చు..!

కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక మంది వైరస్ బారిన పడి పోతున్నారు. దీంతో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. దీని కారణంగా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీ లకు డిమాండ్ పెరిగింది. ఎన్నో రకాల పాలసీలు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. వీటి వలన ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC కూడా సూపర్ పాలసీని ఒకటి అందించింది. అదే ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఈ పాలసీ తో చాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఒకేలా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బీమాతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తాయి.

ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు అందిస్తారు. కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఈ డబ్బులు వస్తాయి. సహజ మరణానికి అయితే రూ.30,000 అందిస్తారు. అదే ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.37 వేలు అందిస్తారు. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది.

18 నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎల్‌ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన పాలసీ కూడా పొందొచ్చు. ఏడాదికి రూ.200 ప్రీమియం చెల్లించాలి. ఇందులో రూ.100 రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే ఈ పాలసీ లో మీరు వంద రూపాయిలు చెల్లిస్తే చాలు.