మోదీ అదిరే స్కీమ్.. అకౌంట్లోకి రూ.60000 పొందే అవకాశం..!

-

కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ వస్తుంది.. వీటిలో పెన్షన్ స్కీమ్ లు కూడా ఉన్నాయి..మీరు కూడా కేంద్రం అందించే పెన్షన్ స్కీమ్‌లో చేరడం వల్ల ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు..పెన్షన్ స్కీమ్స్‌లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో చేరడం వల్ల నెలకు రూ. 5000 వరకు పొందొచ్చు. కనీసం రూ. 1000 పెన్షన్ వస్తుంది. కేంద్రం ప్రభుత్వం అందించే ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలని భావించే వారికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయసు ఉండాలి. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా రూ. 5 వేల వరకు పెన్షన్ సొంతం చేసుకోవచ్చు.

ఈ పెన్షన్ ను మీరు పొందాలంటే మాత్రం ముందుగా మీరు కొంత డబ్బులను పెట్టాలి.. పెన్షన్ అనేది మీరు చెల్లించే మొత్తం మీద ఉంటుంది..బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. ఆటో డెబిట్ ఫీచర్ ఉంది. దీన్ని ద్వారా ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా డబ్బులు కట్ అవుతాయి. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.1000 పొందాలని భావిస్తే.. నెలకు రూ. 42 కట్టాలి. అదే రూ. 2 వేల కోసం అయితే రూ. 84, రూ. 3 వేల కోసం అయితే రూ. 126, రూ. 4 వేల కోసం అయితే రూ. 168, రూ. 5 వేల కోసం రూ. 210 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది..ఇది మీ పెన్షన్ కోసమే ఉంటుంది..

25 ఏళ్ల వయసులో ఉన్న వారు అయితే రూ. 1000 పెన్షన్ కోసం నెలకు రూ. 76 కట్టాలి. రూ. 2 వేల కోసం రూ. 151, రూ. 3 వేల కోసం రూ. 226, రూ. 4 వేల కోసం రూ. 301, రూ. 5 వేల కోసం రూ. 376 చెల్లించాల్సి వస్తుంది. 30 ఏళ్ల వయసులో ఉన్న వారి విషయానికి వస్తే.. రూ. 5 వేల కోసం రూ. 577 చెల్లించాలి. రూ. 4 వేల కోసం రూ. 462 కట్టాలి. రూ. 3 వేల కోసం రూ. 347, రూ. 2 వేల కోసం రూ. 116, అదే విధంగా 1000 రూపాయల కోసం రూ. 116 చెల్లించాల్సి వస్తుంది.40 ఏళ్ల వయసులో ఉంటే మాత్రం అప్పుడు రూ. 1000 కోసం నెలకు రూ. 291 చెల్లించాల్సి వస్తుంది. రూ. 2 వేల కోసం రూ. 582 కట్టాలి. రూ. 3 వేల కోసం రూ. 873 చెల్లించాలి. రూ. 4 వేల కోసం రూ. 1164 కట్టాలి. ఇక రూ.5 వేల కోసం రూ. 1454 కట్టాలి.. ఒకవేళ వాళ్ళు మరణిస్తే మాత్రం ఆ డబ్బులను కుటుంబానికి ఇస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news