పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..నెలకు రూ.12వేలు డిపాజిట్ చేస్తే రూ.1 కోటి లాభం..

-

తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని చూస్తున్నారా.. అయితే పోస్టా ఫీసు అద్భుతమైన స్కీమ్ ను అందిస్తుంది.. పోస్టాఫీసు అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు. పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే రూ.1 కోటి వరకు ఆదాయం పొందవచ్చు…దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాదికి ఒకసారి జమ చేసిన మొత్తంపై వడ్డీని లెక్కగడుతుంది. ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ రేటు సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాదికి ఒకసారి జమ చేసిన మొత్తంపై వడ్డీని లెక్కగడుతుంది. ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ రేటు సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది… వడ్డీ పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది..

ఈ పథకంలో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తూ కోటి రూపాయలను రిటర్న్స్‌గా పొందవచ్చు. డీఫాల్ట్‌గా 15 ఏళ్లకు మెచ్యూరిటీ గడువు పూర్తవుతుంది.. అయితే మెచ్యూరిటీ గడువు ముగియడానికి ఏడాది ముందే మరో విడత గడుపు పొడిగింపు కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి గడువు పూర్తయితే ఇక పెంచుకోవడానికి వీలుండదు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్‌ నుంచి పొందే మొత్తానికి ప్రభుత్వం పన్ను మినహాయింపు అందిస్తోంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ పథకంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో పాటు మెచ్యూరిటీ అమౌంట్‌పై పొందిన వడ్డీకి కూడా పన్ను వర్తించదు. గ్యారంటీ రిటర్నులు ఉంటాయి.. ఇది ప్రభుత్వ స్కీమ్.. ఎటువంటి రిస్క్ ఉండదు..

Read more RELATED
Recommended to you

Latest news