పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.50 ఇన్వెస్ట్ చేస్తే రూ.35 లక్షలు మీ సొంతం…

-

గ్రామాల్లో ఉండేవారికి పొదుపు పథకాల కోసం సేవింగ్స్ ప్రారంభించడానికి ఇండియా పోస్ట్ ఆఫీస్ బెస్ట్ ప్రదేశం. పోస్టాఫీసు ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది..అంతేకాదు పోస్టాఫీసులు అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. ఇంకా వారికి మంచి ఆదాయాన్ని అందించడం ద్వారా వారి భవిష్యత్తును సురక్షితం చేస్తుంది.

గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందినది గ్రామ సురక్ష యోజన పథకం. ఇలాంటి పథకాల గురించి ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రతి నెలా 1500 రూపాయలు ఆదా చేస్తే, మీరు 35 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. 19 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు..వయోపరిమితి 55 సంవత్సరాలు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారు కనిష్టంగా రూ.10,000 నుండి గరిష్టంగా రూ.10 లక్షల వరకు హామీ మొత్తాన్ని పొందుతారు. పెట్టుబడిదారుడికి 80 ఏళ్లు వచ్చినప్పుడు మెచ్యూరిటీ మొత్తం ఇంకా బోనస్ మొత్తం అందుబాటులో ఉంటుంది..

ఈ పథకం ప్రీమియర్ ను 3నెలలు,6 నెలలతో, చెల్లించవచ్చు..రోజుకు దాదాపు రూ.50 చొప్పున నెలకు రూ.1,515 చెల్లించడం ద్వారా రూ. మీరు 35 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పాలసీతో మీరు 55 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.31,60,000 తిరిగి పొందవచ్చు. 58 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.33,40,000 తిరిగి పొందవచ్చు. 60 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.34.60 లక్షలు రాబడి పొందుతారు.. ఈ పథకాలు పొదుపు లో బెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో చెరొచ్చు..మీకు ఇలాంటి ఆలోచన ఉంటే మీరు కూడా చేరండి..మంచి ఆదాయాన్ని పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news