బ్యాంక్ కస్టమర్స్ కి ఆర్బీఐ ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. దీనితో బ్యాంక్ కస్టమర్స్ కి మరెంత కష్టంగా మారింది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా బ్యాంక్ కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్ ఛేంజ్ ఫీజును వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీని కారణంగా కస్టమర్స్ కి ఏటీఎం లావాదేవీలు నిర్వహిస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
బ్యాంకులకు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ చార్జీలను పెంచుకోవచ్చని ఆర్‌బీఐ చెప్పింది. దీంతో బ్యాంకులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌పై రూ.17 వరకు చార్జీ వసూలు చేయొచ్చు. ఈ ఫీజు ఇది వరకు రూ.15గా ఉండేది.
ఇది ఇలా ఉంటే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు అయితే రూ.5 నుంచి రూ.6కు పెంచింది. అంతే కాదండి ఫ్రీ ఏటీఎం ట్రాన్సక్షన్స్ లిమిట్ దాటితే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.21 వరకు వసూలు చేయొచ్చు.
ఈ చార్జీ ప్రస్తుతం రూ.20గా ఉంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.