SBI: యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల మీ అకౌంట్‌లోకి డబ్బులు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తున్న సంగతి తెలిసినదే. అలానే SBI అనేక పొదుపు పథకాలను కూడా అందిస్తోంది. అందులో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ కూడా కలుగుతాయి.

ఇక ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్‌ లో కనుక మీరు చేరితే ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు. ఇందులో మీరు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలానే 3 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు, 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు జమ చేసిన మొత్తం పై ప్రతీ నెల ఎంత కోరితే అంత బ్యాంకు డిపాజిట్ చేస్తుంది.

ఈ డబ్బు లో అసలు వడ్డీ కూడా ఉంటుంది. అయితే ఎంత అసలు, ఎంత వడ్డీ అనేది డిపాజిట్ చేసే మొత్తం, ఎంచుకునే కాలం బట్టి ఉంటుంది. దీనిలో ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. మైనర్లు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది ఇలా ఉంటే కనీసం రూ.36,000 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల కాలానికి రూ.36,000 డిపాజిట్ చేస్తే నెలకు రూ.1,000 చొప్పున లభిస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ అందిస్తుందో. ప్రస్తుతం 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.30%, ఐదు నుంచి పదేళ్ల కాలానికి 5.40% వడ్డీని ఇస్తోంది ఎస్‌బీఐ. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ అదనంగా వస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ లేదా లోన్ కూడా తీసుకోవచ్చు. యాన్యుటీ బ్యాలెన్స్ ‌లో 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. లోన్ అయితే యాన్యుటీ అమౌంట్ లోన్ అకౌంట్‌లోకి వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news