ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలు బ్యాంకులు బాసటగా నిలుస్తున్నాయి. డ్వాక్రా సంఘాల్లో చేరిన మహిళలకు సులభంగా లోన్స్ వస్తున్నాయి. దీని వలన చాలామంది మహిళలకు రిలీఫ్ కలుగుతోంది. స్వయం సహాయక సంఘాల్లో మహిళలు బ్యాంకు రుణాలు పొందుతూ మన కుటుంబాల్ని నిలబెట్టుకుంటున్నారు. వీరికి అత్యవసర సమయంలో శ్రీనిధి రుణాలు బాసటగా నిలుస్తున్నాయి. దీనికోసం అప్లై చేసుకున్న 48 గంటల్లోనే రుణం మంజూరు అవుతోంది.
దీని వలన మహిళలకు ఆర్థికంగా భరోసా కలుగుతోంది. కరీంనగర్ జిల్లాలో రుణ లక్ష్యం బానే ఉంది. కానీ రికవరీలో వెనుకబడింది. లక్ష్యాలు చేరుకోవడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. మహిళల కోసం 2011లో స్త్రీ నిధిని ప్రారంభించారు అప్పటినుంచి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రుణాలు అందిస్తున్నారు.
సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య వంటి కేటగిరి కింద 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. లోన్ తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే వారికి పావలా వడ్డీ పడుతుంది. ఈ డబ్బుతో మహిళలు చిరు వ్యాపారులు, రైతులు వారికి అవసరం అయ్యే వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డబ్బు పెట్టుబడిగా వాడుకుని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు.