వాటే స్కీమ్….లక్ష పెట్టుబడితో రూ.2 లక్షలు..!

-

మీరు మీ డబ్బులని ఏదైనా స్కీమ్ లో పెట్టాలని అనుకుంటున్నారా..? ఏ రిస్క్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే మీరు దీనిని తీసుకోవాలి. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ  లో మీరు డబ్బులు పెడితే 124 నెలల్లో.. అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో డబుల్ అయ్యిపోతాయి.

 

post offcie
post offcie

ఒకవేళ కనుక మీరు రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు తీసుకోచ్చు. ఈ స్కీమ్ ని ఇండియాన్ పోస్ట్ అమలు చేసింది. ఆ తరవాత మరి కొన్ని బ్యాంకులు కూడా దీనిని అమలు చేసాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే… దేశంలో నివాసముండే భారతీయులు అందరూ దీనికి అర్హులు.

అలానే 18 సంవత్సరాల పైబడిన వారు ముగ్గురు కలిసి కిసాన్ వికాస్ పత్ర జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. 10 సంవత్సరాల వయస్సున్న మైనర్ లేదా అతడి సంరక్షకుడు లేదా మానసికంగా ఎదగని పిల్లల సంరక్షులు మైనర్ల పేరుతో కూడా ఈ స్కీమ్ ని ఓపెన్ చెయ్యచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అకౌంట్ ను కలిగిన మిగిలిన వారికి బదిలీ అవుతుంది.

KVP అనేది 30 నెలల లాక్-ఇన్ పీరియడ్ తో వస్తుంది. అంటే ఈ 30 నెలల కాలంలో అకౌంట్ హోల్డర్ తన ఇన్వెస్ట్ మెంట్ ని విత్ డ్రా చేసుకోలేడు. ఇది ఇలా ఉంటే 30 నెలలు గడిచాక ఆరు నెలల బ్లాక్ లలో తన డబ్బును విత్ డ్రా చెయ్యచ్చు. ప్రీమెచ్యూర్ విత్ డ్రా కోసమైతే అకౌంట్ హోల్డర్ పెట్టిన పెట్టుబడిలో కొంత భాగం అకౌంట్ ని తెరిస్తే వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news