మ్యూఛువల్ ఫండ్లు కేవలం స్టాక్స్ లో మాత్రమే పెట్టుబడి పెడతాయా?

-

పెట్టుబడి అన్న మాట వినిపించగానే మ్యూఛువల్ ఫండ్ అన్న పదం వెంటనే వచ్చేస్తుంది. మ్యూఛువల్ ఫండ్లకి మార్కెట్లో ఎంత గిరాకీ ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఐతే మ్యూఛువల్ ఫండ్ల మీద ఆసక్తి చాలామందిలో అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా? నష్టాలు వస్తే ఏం చేయాలి? గ్యారెంటీ ఉండదు కదా.. అన్న సందేహాలు కలుగుతుంటాయి. అలాంటి సందేహాల్లో ఒకటి, స్టాక్స్ లో మాత్రమే పెట్టుబడి పెడతారా అనేది.

 

mutual funds
mutual funds

మ్యూఛువల్ ఫండ్లలో పెట్టుబడులు కేవలం స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారా అన్న సందేహం చాలామందిలో ఉంది. ప్రస్తుతం ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.

పై ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే కాదు అని చెప్పాలి. స్టాక్స్ కాకుండా మ్యూఛువల్ ఫండ్లలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ సంస్థలు, టీ బిల్స్, ఈ పేపర్, బ్యాంకులు, కంపెనీలు జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెడతాయి. కానీ వీటిల్లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. స్టాక్స్ లో వచ్చే రిటర్న్స్ తో పోలిస్తే ఇక్కడ వచ్చే రిటర్న్స్ తక్కువ. కాకపోతే ఇక్కడ వచ్చే రిటర్న్స్ స్వల్ప కాలానికి సరిపోయేంతలా ఉంటాయి.

అదే స్టాక్స్ లో పెట్టే పెట్టుబడుల్లో దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుంది. రిటర్న్స్ కూడా అదే రేంజిలో కనిపించే అవకాశం ఉంటుంది.

రిస్కు వద్దని భావించే వారు, మ్యూఛువల్ ఫండ్లు ఎలా ఉంటాయో రుచి చూడాలనుకున్న వారు, తక్కువ కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నవారు పైన చెప్పిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసి చూడవచ్చు.

గమనిక: మ్యూఛువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన దస్తావేజులు సరిగ్గా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news