మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి.. నెలకు రూ. 5వేలు పెడితే 30 ఏళ్లకు రూ. 2.75 కోట్లు

-

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రిస్క్‌ లేకుండా డబ్బులు సేవ్‌ చేసుకోవచ్చు అని చాలా మంది అనే మాట. మంచి రాబడి ఉంటుంది. వీటిలో దీర్ఘకాలంలో ఇన్వస్ట్‌ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటే.. లాంగ్‌ టర్మల్‌లో ఇన్వస్ట్‌ చేయాలంటే.. SIP ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు 5000 రూపాయలు ఆదాచేస్తే..2.75 కోట్లు పొందవచ్చు తెలుసా..?

స్టాక్‌ మార్కెట్స్‌తో పోలిస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ చాలా తక్కువగా ఉంటుంది. ముందు మన డబ్బు ఎక్కకడికీ పోదు. అందుకే చాలా మంది బ్యాంకుల్లో ఫిక్సిస్డ్‌ డిపాజిట్లు చేసేకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే డబ్బును పెడుతున్నారు. పైగా ఇక్కడ వడ్డీ కూడా డబుల్‌ వస్తుంది. ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌ అనేవి.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి.. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడాలి. మీరు నెలకు రూ.5,000 ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ. 2.75 కోట్ల వరకు సంపాదించవచ్చు.

భారతదేశంలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న SIP కాలిక్యులేటర్ ప్రకారం, SIPలో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, 30 సంవత్సరాల తర్వాత మీకు సంవత్సరానికి 14% సంభావ్య రాబడి ఆధారంగా రూ.2.5 కోట్లు పైనే రిటర్న్ లభిస్తుంది. అయితే ఈ కాలంలో మీరు కేవలం 18 లక్షల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తారు. అయితే… ఇది అంచనా రాబడి మాత్రమే.. ఇందులో మార్కెట్ రిస్క్ ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. రిటర్న్‌లకు సంబంధించి ఇక్కడ ఇచ్చిన గణాంకాలు సమాచారం కోసం మాత్రమే. ఇవి కచ్చితంగా వస్తాయి అని గ్యారెంటీ లేదు. తగ్గొచ్చు, పెరగొచ్చు. నిపుణుల సహాయం లేకుండా పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం అని గుర్తించగలరు. మేం కేవలం సమాచారం కోసం ఈ కథనం అందించాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version