ఎల్ఐసీ పాలసీపై లోన్… ఇలా ఈజీగా అప్లై చేసుకోండి..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా ఎన్నో లాభాలు వున్నాయి. పన్ను ప్రయోజనాలు, రుణ ప్రయోజనాలు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. LIC లో డబ్బులు పెట్టడం సేఫ్ ఏ.

ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అయితే LIC ద్వారా లోన్ ని కూడా పొందొచ్చు. ఆర్ధిక సమస్యలు వున్నాయి అంటే LIC ద్వారా లోన్ ని పొందొచ్చు. అయితే మరి ఎలా లోన్ తీసుకోవాలి..?, లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనే విషయాలను చూద్దాం.

LIC లోన్ కి ఎవరు అర్హులు..?

ఈ లోన్ ని పొందాలి అంటే మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
అలానే మీకు ఒక LIC పాలసీ ఉండాలి.
ఎల్‌ఐసి పాలసీకి గ్యారెంటీ సరెండర్ విలువ ఉండాలి.
3 సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియం కట్టాకనే లోన్ కి అర్హులు.

ఇలా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి…?

దీని కోసం మొదట మీరు అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.
‘ఆన్‌లైన్ లోన్’ ఆప్షన్‌ ని ఇప్పుడు మీరు సెలక్ట్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ LIC లోన్ కోసం ‘త్రు కస్టమర్ పోర్టల్’ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు ID, DOB, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
ఇప్పుడు మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న పాలసీని సెలెక్ట్ చేసుకోండి.
రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరువాత 3 నుంచి 5 రోజుల్లో లోన్ మంజూరు అయ్యిపోతుంది.

ఆఫ్‌లైన్ లో అయితే ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లండి. ఫార్మ్ ని నింపేసి డాక్యుమెంట్‌తో పాటు KYC పత్రాన్ని సబ్మిట్ చెయ్యండి సరిపోతుంది.

ఈ డాక్యుమెంట్స్ అవసరం:

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, ఇతర గుర్తింపు పత్రాలు కావాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news