రైతులకు మోదీ గుడ్ న్యూస్..సగం ధరకే వ్యవసాయ పరికరాలు..

-

మోడీ ప్రభుత్వం రైతులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్న సంగతి తెలిసిందే..రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది.పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కుసుం యోజన, పీఎం కృషి సించాయి యోజన, పీఎం కృషి వికాస్ యోజన.. ఇలా ఎన్నో పథకాల ద్వారా చేయూతనందిస్తోంది. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఇలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

ఈ మధ్య వ్యవసాయంలో కూలీ ఖర్చులు ఇటీవల పెరిగిపోయాయి. కూలీ ఖర్చులను తగ్గించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలో ట్రాక్టర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీ ఇస్తోంది. ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ కింద ఈ సబ్సిడీని ఇస్తున్నారు.ఒకప్పుడు రైతులకు ఎద్దుల తో వ్యవసాయం చేసేవారు.ఇప్పుడు కాలం మారింది..ట్రాక్టర్లు చాలా అవసరం.విత్తు నాటిన దగ్గర నుంచి మార్కెట్ కు తీసుకెల్లె వరకూ అన్నీ పనులకు ఉపయోగపడుతుంది.

ట్రాక్టర్ లేని రైతులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లు లేక ఎద్దులను వినియోగించుకోవాల్సి వస్తోంది..రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజన పధకాన్ని అమలు చేస్తున్నారు.పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద రైతులకు తక్కువ ధరకు ట్రాక్టర్‌ను అందజేస్తున్నారు. అన్నదాతలకు సగం ధరకే ట్రాక్టర్లను ఇస్తున్నారు. రైతులు ఏ కంపెనీ ట్రాక్టర్లనైనా సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

మిగిలిన సగం డబ్బును ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. 20 నుంచి 50 శాతం వరకూ సబ్సిడీ ఇస్తున్నారు.రైతులు సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో అవసరం. ఈ వివరాలతో మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు..ఈ పథకం గురించి పూర్తీగా తెలియాలంటే దగ్గరలొని వ్యవసాయ అధికారులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news