మీ డబ్బును ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభం.. రిస్క్‌ లేని పొదుపు స్కీమ్స్ ఇవే..!

-

ఉద్యోగం చేస్తున్నాం.. శాలరీ వస్తుంది. కానీ వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. సేవింగ్స్‌ చేద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు డబ్బులు మిగలడం లేదు అనుకుంటున్నారా..? కానీ రాబోయే ఖర్చులను ముందుగానే అంచానా వేసుకుని వాటికి తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకున్నప్పుడే మనం ఏ పరిస్థితులను అయినా ఈజీగా ఫేస్‌ చేయగలుగుతాం. ఒక్కసారిగా భారీ మొత్తంలో ఆదా చేయలేం, కాబట్టి క్రమంగా కొంత మొత్తంలో సేవ్ చేయాలి. అలాగే సురక్షిత మార్గంలో పెట్టుబడి పెట్టాలి. ఇందుకు మార్కెట్లో బోలెడు మార్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఓ 33 ఏళ్ల వ్యక్తికి ఎలాంటి స్ట్రాటజీ పెట్టుకుంటే బాగుంటుందో చూద్దామా..!

మ్యూచువల్ ఫండ్స్

ఫైనాన్షియల్ పరంగా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి ఆప్షన్. ఇందుకు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, తదితర ఫండ్స్‌ ఎంచుకోవచ్చు. ఉదాహరణకు వివిధ రకాల ఫండ్స్‌తో కలిపి సంవత్సరానికి రూ.4.32 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. వీటి నుంచి ఏడాదికి సగటుగా 12 శాతం రిటర్న్‌లను అంచనా వేస్తే టర్మ్ పూర్తయ్యేసరికి రూ.2.84 కోట్లకు చేరుకుంటుంది. ట్యాక్స్‌ కట్టిన తర్వాత రూ.2.64 కోట్లు అవుతుంది. అవసరాలను బట్టి సిప్ పరిమితిని పెంచుకోవచ్చు.

పీపీఎఫ్ అకౌంట్

నిర్దిష్ట కాలపరిమితి వరకు పెట్టుబడి పెట్టేందుకు ఈ పీపీఎఫ్ అకౌంట్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఉదాహరణకు రూ.3.56 లక్షల కార్పస్‌తో ఓ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశారని అనుకుందాం. ప్రతి నెలకు రూ.1,500 పొదుపు చేస్తే గడువు పూర్తయ్యాక పెద్ద మొత్తంలో పొందవచ్చు. ఏడాదికి 7.10 శాతం రిటర్న్‌లు వేసుకున్నా మెచ్యురిటీ సమయానికి పీపీఎఫ్ అమౌంట్ రూ.17 లక్షలకు పెరుగుతుంది. పైగా, దీనికి ట్యాక్స్ ఉండదు.

పిల్లల భవిష్యత్

పిల్లల భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే పిల్లల కోసం ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి. ఆడపిల్లలకు కేంద్రం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం అమలు చేస్తుంది. ఇందులో సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. నెలకు రూ.12 వేలు చెల్లిస్తే 8 శాతం చక్రవడ్డీ రేటుతో కలిపి 18 ఏళ్లకు రూ.67 లక్షలు అవుతుంది. మెచ్యురిటీ పూర్తయ్యాక రూ.3.5 కోట్లు చేతికి అందుతుంది. కాబట్టి, నాటికి అయ్యే విద్యా ఖర్చులను భరించవచ్చు. ఒక్క విద్యా ఖర్చులే కాదు అప్పుడు ఉండే అవసరాలకు తగ్గట్టుగా ఏదైనా వాడుకోవచ్చు.

పెన్షన్ స్కీమ్

ఉద్యోగులు ‘నేషనల్ పెన్షన్ స్కీమ్’లోనూ జమ చేసుకోవచ్చు. ఏటా రూ.50 వేలు చెల్లిస్తే.. 8 శాతం రిటర్న్‌తో పొదుపు చేసిన మొత్తం దాదాపు రూ.20 లక్షలకు చేరుకుంటుంది. ఇవి కూడా అక్కరకొస్తాయి. దీంతో పాటు కనీసం 6 నెలల వేతనాన్ని ఎమర్జెన్సీ కార్పస్‌గా దాచుకోవాలి. ఊహించని ఖర్చులు ఎదురైతే ఈ డబ్బులు ఉపయోగ పడతాయి.

ఇలా ఖర్చులో ఖర్చు ఎందులో ఒక దాంట్లో ఒక్కసారి పొదుపు చేయడం స్టాట్‌ చేస్తే ఆటోమెటిగ్గా మీరే అలవాటు పడతారు. మనకు తెలియకుండా చాలా డబ్బు వృద్ధా అవుతుంది. కనీసం మీరు అది తెలుసుకోలేరు. కాబట్టి ఏదో ఒక పొదుపు మార్గాన్ని ఎంచుకోండి. పోస్ట్‌ ఆఫీస్‌లో చాలా స్కీమ్స్‌ తక్కువ ప్రీమియంతో ఉన్నాయి. మీ వయసు 28 ఏళ్లు అయితే నెలకు 1900 కడితే మీకు 50 ఏళ్లు వచ్చేసరికి రూ.10 లక్షల చిల్లర వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్లకు 1900 నెల నెల కట్టడం పెద్ద సమస్య కాదు. నెల నెలా వద్దు అనుకుంటే మూడు నెలలకో, ఆరునెలలకో, లేదా ఒకేసారి సంవత్సరానికో కట్టేస్తే చాలు.! పైగా 10 లక్షలు ఇన్సూరెన్స్‌ ఫెసిలిటీ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version