పీపీఎఫ్లో సూపర్ స్కీమ్..రూ.417 పెట్టుబడి పెడితే కోటికి పైగా రాబడి..

-

సేవింగ్స్ కోసం ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఎటువంటి రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనీ అనుకోనేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..మన దేశంలో అత్యంత ప్రజాదారన పొందిన స్కీమ్ లలో ఇది కూడా ఒకటి..ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్ ఫీచర్తో పీపీఎఫ్ ప్రజలకు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ ఆప్షన్ను కల్పిస్తోంది. ఇది పూర్తిగా టాక్స్ ఫ్రీ సేవింగ్స్ స్కీమ్. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ 1968లో పీపీఎఫ్ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు క్రమం తప్పకుండా నెలకు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి 25 ఏళ్లకు కోటీశ్వరులు అవ్వవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.. ఆ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

 

పీపీఎఫ్‌ వార్షికంగా 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. గైడ్‌లైన్ ప్రకారం.. పెట్టుబడిదారులు తమ డబ్బును తమ పీపీఎఫ్‌ ఖాతాలో వరుసగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 15 సంవత్సరాల చివరిలో డబ్బు అవసరం లేకపోతే, పీపీఎఫ్‌ అకౌంట్ టెన్యూర్‌ను అవసరమైనన్ని సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. పీపీఎఫ్‌ ఖాతా పొడిగింపు ఫారమ్‌ను సమర్పించి ఐదేళ్ల పాటు పెంచుకుంటూ పోవచ్చు. పీపీఎఫ్ ఖాతాల్లో సంవత్సరానికి మినిమం రూ.500, మ్యాక్సిమం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

పీపీఎఫ్‌లో రోజుకు రూ.417 క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులు కావచ్చు. పీపీఎఫ్‌లో రోజుకు రూ.417 పెట్టుబడి పెడితే, నెలవారీ పెట్టుబడి విలువ దాదాపు రూ.12,500 వరకు వస్తుంది. అంటే సంవత్సరానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ.1,50,00 కంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. 15 సంవత్సరాలలో, కాంట్రిబ్యూట్‌ చేసిన మొత్తం రూ.40.58 లక్షలు అవుతుంది. ఆపై టెన్యూర్‌ను ఐదేళ్ల చొప్పున రెండుసార్లు పొడిగించాలి.

అలా 25 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.1.03 కోట్ల వరకు అందుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితం. మొత్తం వడ్డీ దాదాపు రూ.66 లక్షలు అవుతుంది. 25 ఏళ్లలో డిపాజిట్ చేసిన మొత్తం దాదాపు రూ.37 లక్షలు ఉంటుంది. పెట్టుబడిపై అధిక రాబడిని పొందడానికి బెస్ట్ మార్గం ఇది..ప్రతి నెల 1 నుంచి 5 లోపు పే చెయ్యాలి లేకుంటే వడ్డీ నష్టపోయే ప్రమాదం ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news