లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పాలసీలు చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఎల్ఐసీలో అనేక ప్రయోజనాలు ఉండే పాలసీలు ఎన్నో ఉన్నాయి..ఇందులో ప్రజాదరణ పొందిన స్కీమ్ లు ఎన్నో ఉన్నాయి. బెస్ట్ పాలసీలో ఒకటి ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ.. 1 ఫిబ్రవరి 2020లో ప్రారంభించబడింది. ఇది నాన్ లింక్డ్, పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్. ఇందులో, పాలసీదారుడు రక్షణతో పాటు పొదుపు ప్రయోజనం పొందుతాడు.మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, నామినీకి ఆర్థిక మద్దతు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీలో రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ పాలసీ 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనర్హులు..ఈ ప్లాన్ మూడు పాలసీ పీరియడ్లతో అందుబాటులో ఉంది. ఈ పాలసీని 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్ల వ్యవధిలో తీసుకోవచ్చు. గరిష్టంగా 59 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ పాలసీని తీసుకోవచ్చు. అంటే 8 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా ఈ ప్లాన్ను కొనుగోలు చేయవచ్చు..
LIC జీవన్ లాభ్ పాలసీ వివరాలు..
*. కనీస హామీ మొత్తం రూ. 2 లక్షలు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.
*. ఈ పాలసీ పాలసీ వ్యవధి 16 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది.
*. ఈ పాలసీకి ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది.
*. ఈ పాలసీని 8 నుంచి 59 సంవత్సరాల వయసు వారు తీసుకోవచ్చు.
*. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు వార్షిక ప్రాతిపదికన క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించవచ్చు.
*. గ్రేస్ పీరియడ్- మీరు నెలవారీ ప్రీమియం చెల్లిస్తే 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనుమతించబడుతుంది.
*. త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు వార్షిక చెల్లింపులకు 30 రోజుల వ్యవధి అనుమతించబడుతుంది.
*. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, నామినీకి హామీ మొత్తం చెల్లించబడుతుంది. నామినీ బోనస్‌తో పాటు హామీ మొత్తం యోజనం పొందుతాడు..అయితే 3 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తె అతడు లోన్ కూడా పొందుతాడు.
ఇకపోతే మీరు 20 లక్షల బీమా మొత్తాన్ని ఎంచుకుంటే మీరు రోజుకు 251 ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీలో 16 సంవత్సరాల పాటు పన్నుతో సహా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మెచ్యూరిటీపై రూ.20 లక్షల వరకు పొందవచ్చు..