దేశంలో ఇకపై ఎవరైనా సరే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు ఆ పైన విలువైన నగదును ఒక బ్యాంక్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసినా.. లేదా ఒకేసారి రూ.50వేల కన్నా ఎక్కువగా నగదును విత్‌డ్రా చేసినా తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించాలన్న నిబంధనను అమలులోకి తేనున్నారని తెలిసింది.
మోదీ ప్రభుత్వం గతంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి షాకింగ్ నిర్ణయాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ సారి మళ్లీ ప్రధాని అయిన మోదీ మళ్లీ ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటారోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే నగదు విత్‌డ్రాయల్‌పై మోదీ ఓ బాంబ్ వేయనున్నారని తెలిసింది. ఇకపై పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తే ఆధార్ కార్డు కచ్చితంగా చూపించాల్సిందేనన్న నిబంధనను అమలులోకి తేనున్నారట.
దేశంలో ఇకపై ఎవరైనా సరే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు ఆ పైన విలువైన నగదును ఒక బ్యాంక్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసినా.. లేదా ఒకేసారి రూ.50వేల కన్నా ఎక్కువగా నగదును విత్‌డ్రా చేసినా తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించాలన్న నిబంధనను అమలులోకి తేనున్నారని తెలిసింది. దీంతో వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను పోల్చి చూడాలని, వాటిలో ఏమైనా తేడాలు వస్తే చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ భావిస్తున్నదట. అందుకనే త్వరలో ఇలా పెద్ద ఎత్తున జరిగే నగదు విత్‌డ్రాలకు కొత్తగా ఆధార్ కార్డును చూపించాలనే నిబంధనను తీసుకురానున్నారని తెలుస్తోంది.
అయితే ఈ నిబంధన వల్ల నగదు వినియోగం తగ్గడంతోపాటు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, నల్లధనం కట్టడి అవుతుందని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొట్టే వారి సంఖ్య తగ్గుతుందని, ప్రభుత్వాలకు పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, నగదు వినియోగంలో పారదర్శకత ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అయితే వచ్చే నెల 5వ తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!