మీకు తెలుసా? పిడుగు పడి మరణిస్తే 6 లక్షల నష్టపరిహారం.. అందరికీ తెలియజేయండి..!

-

ఇంత విలువైన సమాచారం తెలంగాణలోని చాలా మందికి తెలియదు. ఈ సమాచారాన్ని అందరికీ తెలిసేలా చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్, బంధువులు, ఇతరులకు తెలిసేలా చేయండి. ఎవరైనా పిడుగు పడి మృతి చెందితే వాళ్ల కుటుంబాన్ని ఆదుకున్న వాళ్లం అవుతాం.

వర్షా కాలం రానే వచ్చింది. వర్షాలు విరివిగా పడతాయి. వర్షాలతో పాటు అప్పుడప్పుడు పిడుగులు కూడా పడుతుంటాయి. ఎండాకాలంలోనూ పిడుగులు పడి చాలామంది తెలంగాణలో మృతి చెందారు. పొలంలో పని చేస్తుండగా… చెట్టు కింద నిలబడినా.. ఇలా పలు ప్రాంతాల్లో పిడుగు పడి చాలామంది మరణించారు. దీంతో మరణించిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అయితే… తెలంగాణలో పిడుగు పడి ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం తరుపున 6 లక్షల రూపాయల నష్ట పరిహారం అందిస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు కానీ… పిడుగు పడి మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 6 లక్షల రూపాయల పరిహారం అందుతుంది.

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 2015 – 2020 వరకు ఐదేళ్ల కాలానికి పిడుగు పడి మరణించిన వారి కుటుంబానికి ఆరు లక్షల రూపాయల పరిహారం అందివ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. దీంతో పిడుగు పడి మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది.

ఇదివరకు ఆపద్బంధు స్కీమ్ కింద పిడుగు పడి మరణించిన వాళ్ల కుటుంబాలకు 50 వేల రూపాయల సాయం చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి 6 లక్షల రూపాయలు అందిస్తారు.

పిడుగుపాటుకు గురై మరణించిన వాళ్ల వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వెరిఫై చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ కు వివరాలు ఎమ్మార్వో లేదా ఆర్డీవో నుంచి అందుతాయి. ప్రభుత్వం వివరాలను కన్ఫమ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీకి ఆరు లక్షల రూపాయలను అందిస్తుంది.

ఇంత విలువైన సమాచారం తెలంగాణలోని చాలా మందికి తెలియదు. ఈ సమాచారాన్ని అందరికీ తెలిసేలా చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్, బంధువులు, ఇతరులకు తెలిసేలా చేయండి. ఎవరైనా పిడుగు పడి మృతి చెందితే వాళ్ల కుటుంబాన్ని ఆదుకున్న వాళ్లం అవుతాం.

Read more RELATED
Recommended to you

Latest news